గల్ఫ్ లో ఉంటున్న ఎన్నారైల కోసం తెలంగాణా ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడితో జులై నెలలో టి - ఎన్నారై పాలసీ తిసుకువస్తున్నట్టుగా ప్రకటించారు.అయితే ఇప్పటివరకు కూడా అది కార్యరూపం దాల్చలేదు.ఎన్నారైల ప్రతినిధులు పాలసీ విషయంలో చాలా విలువైన సూచనలు కూడా చేశారు. అయినా సరే తెలంగాణా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. మూడేళ్లలో 600మంది గల్ఫ్‌లో చనిపోగా ప్రభుత్వం ఒక్క పైసా సాయం చెయ్యలేదని, అక్కడ జైళ్లలో ఉన్న మనవారికి న్యాయ సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తువస్తున్నారు కొన్ని నెలల నుంచి.

 

గల్ఫ్ లో ఎవరన్న అనారోగ్యంతో ఉంటే వారికి సాయం చేయడానికి ఇక్కడి నుంచీ వెళ్తే వారు వంద రియాజ్‌లు పన్ను కట్టాల్సి వస్తోందన్నారు. గల్ఫ్ ఎన్నారైల నుంచి తెలంగాణా ప్రభుత్వానికి నెలకు రూ. 50  కోట్ల పన్ను వస్తున్నా ఎన్నారైన విషయంలో అలసత్వం చేస్తున్నారని..ప్రభుత్వం తక్షణం పాలసీ ప్రకటించాలని..ఎప్పటికప్పుడు కోరుతూనే వస్తున్నారు అయినా ప్రభుత్వం నుంచీ ఎటువంటి స్పందన లేకపోవడంతో గల్ఫ్ లో ఉంటున్న ఎన్నారైలు వినూత్నంగా టి-సర్కార్ మీద వత్తిడి పెంచుతున్నారు.

 

గల్ఫ్ లో ఉంటున్న తెలంగాణా వాసులు ఏర్పాటు చేసుకున్న “గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక”  టీ-ఎన్నారై పాలసీ కోసం తెలంగాణ నుంచి వలస వెళ్లిన గల్ఫ్‌ వాసులు మరియు ‘గల్ఫ్‌ కార్మికుల అవగాహన వేదిక’ కలిసి లక్ష సంతకాల కార్యక్రమం చేపట్టారు ఈ సంతకాల సేకరణకి అక్కడ భారీగా స్పందన వస్తోందని చెప్తున్నారు. శనివారం యూఏఈ రాజధని అబుదాబి, రస్‌ అల్‌ ఖైమ ,ముస్సఫా, షార్జ్‌ అలిముస, రస్‌ అల్‌ ఖైమ, బనియస్‌ చైన్‌ క్యాంప్స్‌,  షార్జ్‌ సజ్జ తదితర ప్రాంతాల్లో సంతకాల సేకరణ జరిగింది. ముఖ్యంగా ఈ సంతకాల సేకరణకి అక్కడ ఉంటున్ననర్సన్న(మస్కట్‌), హన్మండ్లు(బహ్రయిన్‌), , శంకర్‌(మస్కట్‌), అశోక్‌ నాలం, వెంకీ(దుబాయ్‌)శ్రీనివాస్‌ రస్‌ అల్‌ ఖైమ, శరత్‌, సాయినాథ్‌లు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: