తెలుగు వాళ్ళ ఘనత చాటి చెప్పాలనే సంకల్పంతో ప్రపంచ తెలుగు సభలని ఎంతో ఘనంగా చేయాలని భావిస్తూ తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆది లోనే ఎన్నో గొడవలు ఎదురవుతున్నాయి. ఈ సభలో..టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో దేశపతి శ్రీనివాస్‌ను ఘెరావ్ చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఆదిలోనే హంసపాదుకా అన్నట్లు ఎటువంటి భాష పరిజ్ఞానం, సాహిత్య పరిచయంలేని వ్యాపార వేత్తను ఎన్నారై కో ఆర్డినేటర్‌గా నియమించి తెలుగు మహాసభల స్థాయిని తగ్గించారని పెద్ద గొడవే చేశారు.

 

అమెరికాలో నివాసముంటున్న మహేష్ బిగలను ఏ ప్రతిపాదికన తెలుగు సభల కోఆర్డినేటర్‌గా నియమించారని ఎటువంటి భాషా పరిజ్ఞానం.. సాహిత్యం తెలియని వారిని నియమించడం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని..రాజకీయాలు చేయాలి అంటే అనేక దార్లు ఉన్నయాని..ఎందుకు ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తారు వెంటనే మహేష్‌ను తొలగించి ఆ స్థానంలో సాహిత్యవేత్తలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. దేశపతి శ్రీనివాస్ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

 

మహేష్ బిగాల నియామకంపై ఎవ్వరు కూడా సంతోషంగా లేరని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కూడా ఆయన ఎన్నికని    వ్యతిరేకించారని..ఆయన ఉంటే ఈ మహా సభలకి గౌరవమే లేదని తెలిపారు..మహేష్ బీగాల నియామకం చట్టరీత్రా వ్యతిరేకమని..వెంటనే ఆయన్ని ఆ పదవినుంచీ తొలిగించమని రాజశేఖర్ రెడ్డి.మన్యం డిమాండ్ చేశారు .గతంలో ఇదిలా ఉంటే గతంలో ఒక టెలివిజన్ లో రెడ్డి కులాన్ని దేశాదిపతి..శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేసారని అక్కడే ఉన్న మరి కొతమంది ఎన్నారైలు డిమాండ్ చేశారు.. ఎటువంటి కులాన్ని అయినా సరే దూషించడం తగదని దేశాదిపతి..శ్రీనివాస్ వెంటనే క్షమాపణ చెపాలని డిమాండ్ చేశారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: