పరాయి దేశం వెళ్ళే ఎంతో మందికి అక్కడ ఎలా ఉండాలి, ఎటువంటి నిభందనలు ఎదురవుతాయి, సమస్యలు ఎదురయినప్పుడు వాటిని ఎలా పరిష్కరిచుకోవాలి..ఎవరిని కలవాలి...ఇలా అనేక ప్రశ్నలకి సమాధానాలు మనం తెలుసుకుని వెళ్ళాలి..అప్పుడే మానసికంగా ఎంతో దృడంగా ఉంటాము.అయితే ఎంతో మంది గల్ఫ్ వెళ్లి ఏజంట్ల చేతిలో మోసపోతారు..ఒక పనికివెళ్లి అక్కడ ఆ పని దొరకక వేరే పని రాక దుర్భరమైన జీవితం గడుపుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు..అయితే అలాంటి వాళ్ళకోసం గల్ఫ్ వెళ్లి స్థిరపడాలి అని అనుకునే వారి కోసం ఏపీ ప్రభుత్వం ఒక ప్రత్యకమైన వ్యవస్థని ఏర్పాటు చేసింది..

 Image result for apnrt logo

గల్ఫ్‌కి వెళ్లి స్థిరపడాలని వెళ్ళ యువతకి తగిన శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలో మూడు అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ది శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి. ప్రతీ ఏడాది సుమారు 24 వేల మందికి శిక్షణ ఇస్తారు. మొదటిది రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు అందుకు గాను దాదాపు రూ.4 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఏప్రిల్‌ నాటికి కేంద్రం ఏర్పాటు, శిక్షణ ప్రారంభిస్తారు. గల్ఫ్‌ దేశాలకు ఎక్కువగా వెళ్లే రాయలసీమ ప్రాంతంలోని కడప, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కేంద్రంలో ఏటా 8 వేల మందికి శిక్షణ ఇస్తారు. ఏపీఎన్‌ఆర్‌టీ వీటిని నిర్వహిస్తుంది. ఏజెంట్ల చేతిలో మోసపోకుండా, అక్కడికి వెళ్లాక ఇబ్బంది పడకుండా, వెనక్కి వచ్చే దారిలేక సతమతం అవ్వకుండా ఏపీకి-యూఏఈకి మధ్య ఒప్పందం కుదిరింది.

 

అయితే ప్రభుత్వం ద్వారా కాకుండా సొంతంగా యూఏఈకి వెళ్లేందుకు ఎంపికైన వారికి కూడా తగిన శిక్షణ ఇస్తారు. గల్ఫ్‌లో మెకానిక్‌లు..ప్లంబర్లు..ఎలక్ర్టీషియన్లు..తాపీమేస్త్రిలు..రాడ్‌ బెండింగ్‌ వర్కర్లకు డిమాండ్‌ ఉంది.అయితే చాలా మంది నైపుణ్యం లేని వాళ్ళు కూడా వెళ్ళడంతో వారికి అరకొర జీతాలు ఇస్తున్నారు..అంతేకాదు నైపుణ్యం కలిగిన వాళ్ళు వెళ్ళడం వలన వారికి మిగిలిన వారితో పోల్చుకుంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నాయి అక్కడి కంపెనీలు.


మరింత సమాచారం తెలుసుకోండి: