సంక్రాంతి అంటే ఎంతో వైభోగంగా ప్రతీ ఒక్క తెలుగు వాళ్ళు జరుగుపుకునే పండుగ అందుకే ఎంత దూరంలో ఉండే తెలుగు వారు అయినా సరే రెక్కలు కట్టుకుని మరీ వాలి పోతారు..చిన్నా పెద్దా అనే భేదం లేకుండా అందరు ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటారు..అయితే..ఈ పండుగ మూడు రోజులు గంగిరెద్దులు ,గొబ్బెమ్మలు. రంగవల్లులతో ఎంతో శోభాయమానంగా మారిపోతాయి పల్లెలు..అయితే విదేశాల నుంచీ రాలేని వాళ్ళు ఎంతో మంది కూడా అక్కడే ఉండి పల్లెల్లో ఎలా జరుపుకుంటారో ఆ విధమైన వాతావరణాన్ని అక్కడ కల్పించుకుంటూ పండుగ చేసుకుంటారు..


చైనాలోని షాంగై లో ఉండే తెలుగువారు ఎందరో అక్కడ సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు..తెలుగు అసోసియేషన్ అఫ్ చైనా (టాక్) ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో తెలుగువారంతా ఒకచోట చేరి సంబరాలు జరుపుకొన్నారు. షాంఘై లోని ఎంబసి క్లబ్ లో ఘనంగా నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు ఇండియన్ అసోసియేషన్ అఫ్ చైనా ప్రెసిడెంట్ రాజ్ కుమార్ ఖోసా ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు..అంతేకాదు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. చిన్నారులపై భోగిపళ్లు పోశారు.

Sankranthi celebrations in China - Sakshi

ఆంధ్రప్రదేశ్ సంస్కృతి కి తగ్గట్టుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలతో ఆద్యంతం సంక్రాంతి వేడుకలు ఉల్లాసంగా సాగాయి...తెలుగువారందరూ కలుసుకోవడమే పెద్ద పండుగ అని సాయిరాం క్రోవి అన్నారు..తెలుగు వారు అందరు ఇలా విదేశాలలో ఉన్నా సరే  పండుగ చేసుకోవడం..మన సంస్కృతిని బ్రతికించు  కోవాలి ఎంతో  సంతోషించతగ్గ విషయం అని తెలిపారు..

 


మరింత సమాచారం తెలుసుకోండి: