ఎంతో మంది భారతీయులు విదేశాలలో స్థిరపడి ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటూ భారత్ పరువు నిలబెడుతుంటే మరి కొంతమంది పక్క దార్లు తొక్కి భారత్ పరువు తీస్తున్నారు..అమెరికాలో వీసాల పేరుతో ఒక వ్యక్తి భారీ మోసాలకి పాల్పడాడు అతను మోసం చేసింది కూడా తోటి భారతీయులనే..వివరాలలోకి వెళ్తే..

 Image result for indian-origin-man-sentenced-prison-h1b-visa-fraud-us

భారత్‌కు  చెందిన వారి నుంచి రమేశ్‌ వెంకట పోతూరు అనే 44ఏళ్ల వ్యక్తి హెచ్‌1-బీ వీసా, గ్రీన్‌ కార్డుల దరఖాస్తుల కోసం అక్రమంగా 4,50,000 డాలర్లు సేకరించి మోసం చేశారు.. అయితే రమేశ్‌ వెంకట పోతూరు గతంలో విర్గో ఐఎన్‌సీ, ఐసీనెక్‌ సొల్యూషన్స్‌ కంపెనీల మాజీ యజమాని కూడా..అయితే వీసా మోసాలకి పాల్పడిన ఆయన్ని ఒక ఏడాది ఒకరోజు శిక్షని విదిస్తునట్టుగా అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వెల్లడించారు.

 Image result for indian-origin-man-sentenced-prison-h1b-visa-fraud-us

 రమేష్ పోతూరు  2010 నుంచి 2013 మధ్య కాలంలో దాదాపు వందకు పైగా వీసాలు, గ్రీన్‌ కార్డుల కోసం అక్రమంగా దాదాపు 4,50,000డాలర్లు సేకరించాడు...అంతేకాదు హెచ్‌1-బీ వీసా, గ్రీన్‌ కార్డుల దరఖాస్తుల కోసం కస్టమర్ల నుంచి డబ్బును నేరుగా తన ఖాతాలోకి మళ్లించినట్లు అధికారులు విచారణ చేసి నేరాన్ని దృవీకరించారు..వీసాల విషయంలో ఎవరిని నమ్మి మోసపోవద్దని తెలుపుతున్నారు అధికారులు..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: