స్వదేశంలో పెళ్ళిళ్ళు చేసుకుని విదేశాలలో ఉంటూ భార్యలని పట్టించుకోని ఎన్నారై భర్తలపై కేంద్రం కొరడా ఝులిపించనుంది..అలాంటి ఎన్నారై భర్తలపై కేంద్రం ఉక్కు పాదం మోపనుంది..భార్యలను వదిలేసి తప్పించుకు తిరిగే ఎన్నారై భర్తల ఆగడాలకి కేంద్రం మంత్రి వర్గం  ఖటినమైన చర్యలకి పాల్పడింది.. ఇటీవల పెరుగుతున్న ఎన్నారై భర్తల ఆగడాలపై చర్చించిన కేంద్ర మంత్రివర్గ సంఘం కఠిన చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. విచారణకు హాజరు కావాలని కోర్టు ఇచ్చిన సమన్లను ఖాతరు చేయని ఎన్నారై భర్తల వాటా ఆస్తిని జప్తు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

 Image result for central govt cabinet

అయితే ఈ ఒక్క అంశం మాత్రమే పరిశీలనలో లేదు వారి పాస్ పోర్టుల రద్దు వంటి చర్యలు చేపట్టాలని భావిస్తోంది..ఈ మధ్యకాలంలో ఎంతో మంది ఎన్నారైలు పెళ్ళిళ్ళు అయ్యాక భార్యలని ఇండియాలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయి. దీంతో కేంద్ర మంత్రుల బృందం బాధిత మహిళలకు న్యాయం చేకూర్చేందుకు చేపట్టాల్సిన చర్యలు, చట్టంలో చేయాల్సిన మార్పులపై ..మంత్రుల భేటీలో చర్చించింది..

 Image result for nri husband harassment

భర్త ద్వారా మోసపోయిన మహిళల ఫిర్యాదుపై స్పందించకుండాదేశవిదేశాల్లో గుర్తింపు మార్చుకొని తప్పించుకు తిరిగే ఎన్నారై భర్తల ఉమ్మడి ఆస్తిలో వాటాను సీజ్ చేసేలా చట్టం చేస్తూ సవరణలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది..అంతే కాకుండా సమాధానం రాని కోర్టు సమన్లను విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహించే వెబ్ సైట్ లో పెడతారు. ఈ సైట్ లో నోటీసులు పెడితే సమన్లు అందినట్టే భావించి చర్యలు చేపడతారు..అంతేకాదు తమ ఆచూకీ దొరకకుండా పేర్లు మార్చుకుని తిరుగుతూ ఉండే వారికి అ చెక్ చెప్పాలంటే ఇదే అత్యత్తమ మార్గమని ఇలాంటి వారిని  పరారీలో ఉన్నట్టు ప్రకటించడంతో పాటు వారి ఆస్తుల స్వాధీనం, పాస్‌పోర్టుల రద్దు వంటి చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రుల బృందం సిఫార్సు చేసింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: