ట్రంప్ విధానాల వలన అమెరికాలో ఎన్నోరకాలుగా ఇబ్బందులు పడుతున్న భారత ఎన్నారైలు తమ భవిష్యత్తు ముందు ముందు ఎలా ఉంటుందోనని..ఆందోళన పడుతున్నారు..వీసాలని జారీ చేసే విషయంలో భారతీయులు ఇబ్బంది పడేలా ఎన్నో ఖటినమైన నిభంధనలని ప్రవేసపెట్టిన ట్రంప్ ఆ తరువాత అక్రమ వలస దారులు అంటూ ఎంతో మంది అమెరికాకి వలస వచ్చిన వారిపై  ఉక్కుపాదం మోపాడు..అయితే ఈ క్రమంలోనే...

 

అక్రమంగా వలస వచ్చిన దాదాపు 100 మందిని అరెస్టు చేశారు బోర్డర్ ప్యాట్రోల్, ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు అయిన వారిలో భారతీయులు కూడా ఉన్నారు...అయితే గడిచిన కొన్ని రోజులుగా హూస్టన్‌లో జరిగిన గాలింపు చర్యల్లో .. ఇమ్మిగ్రేషన్ అధికారులు 45 మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఎంత మంది భారతీయులు ఉన్నారన్న అంశాన్ని ఏజెన్సీ వెల్లడించలేదు.

 Related image

హోండర్స్, ఎల్ సాల్వడార్, మెక్సికో, గాటేమాల, అర్జెంటీనా, క్యూబా, నైజీరియా, చిలీ, టర్కీతో పాటు భారత దేశస్థులు ఉన్నారని అమెరికా  ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక ప్రకటనలో భాగంగా తెలిపారు..డిపోర్ట్ అయిన తర్వాత కూడా కొందరు అక్రమంగా దేశంలోకి చొరబడ్డారని అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు అమెరికా స్పష్టం చేసింది.టెక్సాస్‌లోని..అయితే గతంలో కూడా ఇదే విధానం వలన పంజాబ్ కి చెందిన కొంతమందిని అదుపులోకి తీసుకున్న విషయం విదితమే..


మరింత సమాచారం తెలుసుకోండి: