భారతీయ ఎన్నారైలు..ముఖ్యంగా ఐటీ నిపుణులే టార్గెట్ గా సాగుతున్న హెచ్ -4 వీసా రద్దు ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది..త్వరలోనే ఈ వీసా రద్దు జరుగుతుందని దానికి మూడు నెలల కాలవ్యవధి ఉంటుందని ట్రంప్ సర్కార్ కోర్టుకి తెలిపింది..సర్కార్ ఈ వివరణతో అమెరికాలోని ఎన్నారైలు అందరూ కంగారు పడుతున్నారు..వర్క్ పర్మిట్ వీసాగా పరిగణించే హెచ్ -4 వీసా ని రద్దు చేయడం వలన ఆ వీసా ఆధారితంగా వచ్చిన ఎన్నారైల భార్యలు ఉద్యోగాలు చేసుకునే ఎన్నారైలు అమెరికా విడిచి వేల్లిపోవాల్సిందే..

 

అయితే  గత జూన్‌లోనూ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా..కొంతకాలంగా వాయిదాలు వేసుకుంటూ వస్తోంది సర్కార్..ట్రంప్ సర్కార్ ఈ రద్దు వ్యవహారాన్ని ఫెడరల్ కోర్టుకు నివేదికని పంపింది ముఖ్యంగా భారతీయ ఎన్నారైలకి ఈ వార్త ఎంతో కంగారుని పెట్టిస్తోంది..విదేశాల నుంచి అమెరికాకు హెచ్-1బీ వీసా దారుల భర్తలు కానీ భార్యలు కానీ ఎక్కువగా హెచ్-4 వీసాలు కలిగి ఉంటారు..దాంతో వీరందరూ ఎంతో కంగారు పడుతున్నారు..

 Image result for h4 - visa

నిన్నటి రోజున అంటే శనివారం నాడు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలోని కోర్టులో అమెరికా హోమ్‌శాఖ ఈ  పిటిషన్ దాఖలు చేసింది...హెచ్-4 వీసాలను రద్దు చేసేందుకు కార్యాచరణ ప్రారంభమైందని అందుకు గాను మూడునెలల సమయంలో ఇది పూర్తి అవుతుందని కోర్టుకు హోమ్‌శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కొత్త నిబంధనలను వైట్ హౌజ్‌లోని బడ్జెట్ నిర్వహణ కార్యాలయానికి మరో మూడునెలల సమయంలో అందిస్తామని స్పష్టం చేసింది..

 Image result for h4 - visa

ఇదిలాఉంటే  సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ హెచ్-4 వీసాలను రద్దు చేయాలంటూ కోర్టును అభ్యర్ధించిన విషయం తెలిసిందే అయితే ఈ మేరకు వారికి హోంశాఖ వివరణ ఇచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచాలని కోరింది..ఇదే విషయాన్ని కోర్టుకు కూడా తెలిపింది.అయితే ఈ హెచ్ -4 రద్దు చేస్తే హెచ్ -1 బీ వీసా దారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: