భారత మహిళా ఎన్నారై కి అమెరికాలో కీలక పదవి వరించింది..అమెరికాలో అత్యున్నతమైన ఎంతో కీలకమైన పదవిగా పేర్కొనబడే ఆ పదవికి భారత మహిళా ఎంపిక కాబాడటం ఇదే తొలిసారని అక్కడి కధనాలు తెలుపుతున్నాయి ఇంతకీ ఆ మహిళ ఎవరూ ఆమెని వరించిన ఆపదవి ఏమిటి అనే వివరాలలోకి వెళ్తే..

 Image result for rita baranwal

ఎన్నో ఏళ్ల క్రితం అమెరికా వచ్చి స్థిరపడిన రీటా బనర్వాల్ అనే భారత సంతతి మహిళ ఎనర్జీ విభాగంలో అణుశక్తిశాఖ అసిస్టెంట్‌ సెక్రెటరీగా నియమించబడింది...ఈమెను స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎంపిక చేయడం మరొక విశేషమనే చెప్పాలి..అమెరికా ఆధునిక అణు రియాక్టర్ల అభివృద్ధిని వేగవంతం చేయాలని నిర్ణయించిన కొద్దిరోజుల్లోనే ట్రంప్‌ చర్యలను వేగవంతం చేశారు.

 Image result for rita baranwal

అయితే ప్రస్తుతం బరన్వాల్‌ గేట్‌వేఫర్‌ ఆక్సిలరేటెడ్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ న్యూక్లియర్‌లో డైరెక్టరుగా సేవలు అందిస్తున్నారు ఈ ప్రతిపాదనను సెనెట్‌ ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత ఆమెకు అణుశక్తి సాకేంతికత పరిశోధన, అభివృద్ధి, నిర్వహణ వంటి అదనపు బాధ్యతలుంటాయి..రీటా ఎంపిక పట్ల భారత సంతతి వ్యక్తులు భారత ఎన్నారైలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: