అమెరికా అధ్యక్ష ఎన్నికలకి ఇంకా రెండేళ్ళ కాలం ఉండగా...డెమొక్రాట్ల తరుపున అధ్యక్ష బరిలో భారతీయ హిందూ మహిళ నిలబడనుంది అనే వార్త ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఒక పక్క ట్రంప్ అమెరికాలో భారతీయల ఎంట్రీ పై గుర్రుగా ఉంటుంటే ఇప్పుడు ఏకంగా ఒక భారతీయ హిందూ మహిళ అధ్యక్ష బరిలో ఉండటం సంచలనం సృష్టిస్తోంది...వివరాలలోకి వెళ్తే..

 Related image

2020లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో హిందూ మహిళా నేత..డెమోక్రాటిక్‌ పార్టీ ప్రతినిధి తులసి గబార్డ్‌ పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రచారం కోసం ఆమె ఇప్పటికే తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా తెలిస్తోంది..ఈ విషయాని ఆమె సన్నిహితులు తెలపడం గమనార్హం..

 Related image

అందుకు తగ్గట్టుగానే  లాస్‌ ఏంజెలెస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భారత సంతతి వ్యక్తి ప్రముఖ డాక్టర్ అయిన  సంపత్‌ శివంగి మాట్లాడుతూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తులసీ గబార్డ్‌ పోటీ చేస్తారని ప్రకటించారు...అయితే ఈ ప్రకటనని తులసి ఖండించక పోవడంతో ఈ వార్త నిజమేనని భావిస్తున్నారు. ఇదే జరిగి ఆమె విజయం సాధిస్తే అమెరికా అధ్యక్షురాలిగా మొదటి సారి ఎన్నికైన మహిళగా ఆమె రికార్డు సృష్టించినట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: