అమెరికాలో ఇండియన్ అమెరికన్ ఫెస్టివల్ డే ని ఎంతో ఘనంగా నిర్వహించాలని ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్” సంస్థ ప్రెసిడెంట్  డాక్టర్. ప్రసాద్ తోటకూర ఓ ప్రకటనలో తెలిపారు. భారతీయులు అందరూ అమెరికా జీవన స్రవంతిలో భాగం కావాలని ఆయన పిలిపుని ఇచ్చారు. అందులో భాగంగానే “ప్రవాస భారతీయ ఉత్సవం” ని మే 4 వ తేదీన మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.

 Image result for indian american friendship council

ఈ కార్యక్రమానికి ప్రతీ ఒక్క ఇండియన్ ఆహ్వనితులేనని తెలిపారు. ఈకార్యక్రమంలో భాగంగా  పిల్లల వినోదం కోసం పెట్టింగ్ జూ, పోనీ రైడ్స్,  స్టిల్ట్ వాకర్స్, వంటి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసామని ఆయన అన్నారు. వివిధ రకాల వంటకాలతో కూడిన ఫుడ్ స్టాల్స్  మరియు ఇతర బిజినెస్ స్టాల్స్ కొలువు తీరుతాయని, సుమారు 500 మందికి పైగా భారత సంతతికి చెందిన వారి తో పాటు అమెరికన్ యువతీ యువకులు కూడా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటారని ఆయన అన్నారు. ఈ కార్యకమం గురించిన పూర్తి వివరాలకోసం www.iafcusa.org ను సంప్రదించవచ్చునని ఆయన తెలిపారు.   

 


మరింత సమాచారం తెలుసుకోండి: