అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో ఆటా( అమెరికన్ తెలుగు అసోసియేషన్) కి ఓ ప్రత్యేకమైన స్థానం గుర్తింపు ఉంది. కేవలం తమ సేవలని తెలుగు వారికి మాత్రమే కాకుండా భారతీయులు అందరికి అందేలా అమెరికాలో సేవా కార్యక్రమాలు చేపడుతుంది ఆటా. దాంతో అమెరికాలో ఉన్న అతిపెద్ద తెలుగు సంఘాలలో ఆటా కూడా ఒకటిగా నిలిచింది. ఎప్పుడూ ఎదో ఒక సేవాకార్యక్రమాలని అమెరికాలో భారతీయులకి అందించే ఆటా , ఈ సారి అమెరికాలో మెగా హెల్త్ క్యాంప్  నిర్వహించింది.

 

ఆటా వాషింగ్టన్ డీసీ అధ్వర్యంలో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచీ మధ్యాహ్నం 2 వరకూ ఈ క్యాంప్ నిర్వహించారు. దాదాపు 10 ఏళ్ళ అనుభవం ఉన్న 30 మంది డాక్టర్లు ఈ హెల్త్ క్యాంప్ లో సేవలని అందించారు.     అన్ని రంగాల డాక్టర్ల ని పిలిచి, ఓ మెరుగైన ఫార్మసిస్ట్ ని కూడా ఏర్పాటు చేసి ఇంత భారీ స్థాయిలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఇదే ప్రధమమని ఆటా తెలిపింది.

 

ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతీ ఒక్కరూ హెల్త్ క్యాంప్ మాకు ఎంతో ఉపయోగపడిందని అంటూ సంతోషం వ్యక్తం చేశారు. బీపీ, రక్త పరీక్షలు సేవలు కూడా అక్కడే ఏర్పాటు చేశారు.           ఆటా సంస్థ సభ్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతీ భారతీయుడికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా అందరికి సూచనలు, సేవలు అందించిన వైద్యులకి కృతజ్ఞతలతో పాటు జ్ఞాపికలు అందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: