అమెరికాలో కేవలం నెలరోజుల కాలంలో సుమారు ఇద్దరు ఎన్నారైలు చనిపోయిన ఘటనలు మరువక ముందే  ఏపీకి చెందిన మరొక ఎన్నారై మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకుని తల్లి తండ్రుల కలల్ని తీర్చాలని అనుకున్న ఓ విద్యార్ధి కలలు మధ్యలోనే చెదిరిపోయాయి..వివరాలలోకి వెళ్తే...

 Image result for indian nri student died in us sumedh

ఉన్నత చదువుల కోసం తల్లి తండ్రులకి దూరంగా అమెరికాలో వెళ్లి అక్కడ ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ లో ఎమ్మెస్ చదువుతున్న 27 ఏడేళ్ళ సుమేద్ తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడు. ఎంతో సరదాగా సంతోషంగా ఉంటూ అందరిని ఆటపట్టించే కొడుకు తమతో ఇక మాట్లాడడని తెలుసుకున్న తల్లి తండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

 Image result for indian nri student died in us sumedh

అమెరికాలోని పోలీసుల కధనం ప్రకారం. ఆదివారం నాడు సుమేద్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రసిద్ది చెందిన క్రీటర్ లాక్ నది వద్దకి వెళ్ళారు. అక్కడ దాదాపు 25 అడుగుల ఎత్తు నుంచీ సరస్సులోకి దూకిన అతడు మళ్ళీ తిరుగి బయటకి రాలేదు. కంగారు పడిన స్నేహితులు ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న అధికారులకి తెలిపారు. హుటాహుటిన వారు ఈతగాళ్ళని పిలిపించి గాలిస్తే సుమారు 90 అడుగుల లోతులో సుమేద్ మృత దేహం దొరికింది. ఈ విషయాన్ని ఏపీలో ఉన్న సుమేద్ తల్లి తండ్రులకి తెలిపారు అధికారులు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: