అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజేతగా నిలుస్తారు, ట్రంప్ ని “ఢీ” కొట్టబోయేది ఎవరూ అనే ఆసక్తి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చగా నిలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకి ఇప్పటికే డెమోక్రటిక్ పార్టీ వ్యుహలని సిద్దం చేసింది. ఈ క్రమంలో డెమోక్రటిక్ పార్టీ నుంచీ అధ్యక్ష బరిలో ఉన్న భారతీయ ప్రవాసీయురాలు తులసీ గబ్బర్డ్  కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసే ఆలోచన లేదని డెమోక్రటిక్ పార్టీ తరుపునుంచీ తాను పోటీ చేస్తానని ఆమె తెలిపారు. యూఎస్ కాంగ్రెస్ లోకి అడుగుపెట్టిన తొలి హిందూ మహిళగా తులసీ రికార్డ్ సృష్టించారు. అంతేకాదు అనతికాలంలోనే ఆమె విశేష ప్రజాదరణ సొంతం చేసుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ నుంచీ టిక్కెట్ ఆశిస్తున్న ఆశావాహుల్లో తాను కూడా ఉన్నానని ఆమె ప్రకటించుకున్నారు.

 

డెమోక్రటిక్  పార్టీ ఏర్పాటు చేసే ప్రతీ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రజలతో మమేకం అవుతూ వారికి మరింత చేరువ అవుతున్నారు. ఈ సారి రానున్న అమెరిక అధ్యక్ష ఎన్నికల్లో తప్పకుండా ట్రంప్ ని ఓడించి తీరుతానని ఆమె ప్రకటించారు. తులసీ గబ్బర్డ్ గతంలో హవాయి ఆర్మీ నేషనల్ గార్డ్ గా పని చేశారు. తులసీ గబ్బర్డ్తో పాటుగా డెమోక్రటిక్ పార్టీ తరుపునుంచీ మరో ఇండో అమెరికన్  "కమలా హారీస్" కూడా అధ్యక్ష బరిలో ఉన్న విషయం అందరికి తెలిసిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: