ఒక బీర్ ఎంత ఉంటుంది 100 నుండి 250 రుపాయలు  మన దేశం లో కొన్ని చోట్ల బ్యాన్ వల్ల  దాదాపు 500 దాకా ఉంటుంది , కాని ఒక జర్నలిస్ట్ మాత్రం ఒక్క బీర్ కోసం అక్షరాలా 73 లక్షలు చెల్లించారు.  ఇప్పటీ వరకు ఇదే ప్రపంచం లో‌ అతి ఖరీదైన బీర్ అని వ్యంగ్యం‌గా తన ట్విట్ట ఖాతాలో పోస్ట్ చేశాడు.


ఆస్ట్రేలియా వార్తాపత్రిక  చీఫ్ క్రికెట్ జర్నలిస్ట్,  బీర్ ఎడిటర్ పీటర్ లాలోర్  దగ్గర  మాంచెస్టర్‌లోని మాల్మైసన్ హోటల్‌ వారు భారీ మొత్తాన్ని వసూలు చేశారు.   పీటర్ తన విషాద కథ గురించి, తను డ్యూచర్స్ ఐపిఎ బీర్ ను తాగడానికి చెల్లించిన భారీ మొత్తం గురించి  ట్విట్టర్‌లోకి ఒక ట్వీట్ చేశాడు. అతను తన ట్విట్టర్‌లో బీర్ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ "ఈ బీర్ చూడండి? ఇది చరిత్రలో అత్యంత ఖరీదైన బీర్. నిన్న రాత్రి మాంచెస్టర్‌లోని మాల్మైసన్ హోటల్‌లో నేను దాని కోసం, 9 99,983.64 డాలర్లు చెల్లించాను." అని పోస్ట్ చేశాడు.



ఆ హోటల్ అధికారి ఒకరు మాట్లాడుతూ, "మేము ప్రస్తుతం ఏమి జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నాము. లాలోర్ కి క్షమాపణలు చెప్పుకుంటున్నాము, సాధ్యమైనంత త్వరగా దీనిని పరిష్కరించడానికి మేము పీటర్‌తో సంప్రదిస్తున్నాము." అని తెలిపారు. ఈ ఉదాహరణ  ఖచ్చితంగా రాహుల్ బోస్ గురించి  గుర్తు చేసింది. అతను కేవలం రెండు అరటిపండ్లకు మరియు చండీఘర్ లోని మారియట్ హోటల్‌కు 442 రూపాయలు చెల్లించిన విషయం అంతర్జాలం లో వైరల్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: