స్పెయిన్ లో ఒక బొమ్మ కోసం రెండు ఊళ్ళు గొడవ పడుతున్నాయి పదహేనవ శతాబ్దం లో మొదలైన ఈ గొడవ ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం దీన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నారు.  రెండు ఊళ్ల మధ్య మొదలైన గొడవ ఇప్పుడు పండగలా మారింది అందుకు స్పెయిన్ బాజా పట్టణం వేదికైంది ఏటా ఇక్కడ కాస్కామోరాస్ ఉత్సవం నిర్వహిస్తారు. కాస్కామోరాస్ పండుగ గ్రెనడా ప్రావిన్స్ లోనే  బాగా ప్రాచూర్యం పొందింది, బయటీ వారికి అంతగా తెలియదు. అయినా  ప్రతి సంవత్సరం 20,000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

అందులో భాగంగా శుక్రవారం జరిగిన వేడుకల్లో సుమారు పదిహేను వేల మంది పాల్గొన్నారు నల్లరంగు తో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ సంప్రదాయం పదిహేనవ శతాబ్దం లో ఒక చిన్న గొడవతో మొదలైంది. గార్డెన్స్ కు చెందిన ఓ వ్యక్తి కి బాజా ప్రాంతం లో ఒక బొమ్మ దొరికింది అతడు దాన్ని తన గ్రామానికి తీసుకెళ్లాలనుకున్నాడు కానీ బాజాకు చెందిన వారు అందుకు నిరాకరించారు. రెండు ఊర్ల మధ్య బొమ్మ కోసం ఘర్షణ మొదలైంది. అది అలా ప్రస్తుతం పండగ రూపంలో కొనసాగుతోంది. 

నల్లరంగు ఒంటికి అంటకుండా తప్పించుకుంటూ బొమ్మ ను బాజా ప్రాంతాన్ని దాటించిన భారీ విజేత. ఎంతో సరదాగా ఉత్కంఠ భరితంగా ఈ ఉత్సవం సాగుతుంది గాడికి గ్రామస్తులు కాస్కామోరాస్ అంటే దొంగలు వేషధారణ లో పరుగులు తీస్తారు. మూడు రోజుల పాటు జరిగిన సమరంలో గాడిక్స్ గ్రామస్తులు బొమ్మల సొంతం చేసుకోవడం లో విఫలమయ్యాడు చివరకు బాజా ప్రజలు విజయం సాధించారు



మరింత సమాచారం తెలుసుకోండి: