అందుగలరు..ఇందు గలరు అనే సందేహము వలదు ఏ దేశంలో వెతికినా అందందు గలరు అంటూ ఓ సినీ గేయ రచయిత ఎన్నారైల గురించి సరదాగా ఛలోక్తులు వదిలారట.  నిజమే ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే భారతీయుల ఉనికి తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా అమెరికావంటి అగ్రరాజ్యంలో అయితే భారతీయులకి కొదవలేదు. అయితే తాజాగా ఓ నివేదిక ప్రకారం చూస్తే..

 

అమెరికాలో ఉంటున్న ప్రతీ నలుగురు ప్రవాసులలో ఒకరు భారతీయుడు ఉంటున్నారని తెలుస్తోంది. హోం ల్యాండ్ భద్రతా విభాగం నివేదిక ప్రకారం అమెరికాలో నివాసం ఏర్పాటు చేసుకున్న ఇతర దేశాల వారిని పోల్చి చూస్తే దాదాపు  60 శాతం మంది ఆసియా వాసులే ఉన్నట్లుగా నివేదికలో పెర్కొన్నారట.

 

2016 లెక్కల ప్రకారం చూస్తే అమెరికాలో సుమారు 5.8 లక్షల మంది భారతీయులు నాన్ రెసిడెంట్ ఇమ్మిగ్రెంట్స్ గా ఉన్నట్టు తెలుస్తోంది. వీరులో దాదాపు 4.4 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులు కాగా మిగిలిన 1 .4 లక్షల మంది విద్యార్ధులు ఉన్నట్లుగా నివేదికలో తెలిపింది. చైనా సైతం రెండవ స్థానంలో ఉండగా మనం మనం మాత్రం మొదటి స్థానంలో నిలిచాం.


మరింత సమాచారం తెలుసుకోండి: