అమెరికాలో మోడీ పర్యటన జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన  “హౌడీ మోడీ” కి ఊహించని షాక్ తగిలింది. ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని సుమారు 1500 మంది అహర్నిశలు కష్టపడి రూప కల్పన చేశారు. అంతేకాదు ఈ సభకి దాదాపు 50 వేలమందికి పైగానే ఇండో అమెరికన్స్ వస్తున్నారని, మరింత మంది పాస్ లకోసం అడుగుతున్నారని అయితే అనుమతుల ప్రకారం కేవలం 50 వేల మందికి మాత్రమే అనుమతి రావడంతో చేసేది లేక కార్యక్రమానికి సన్నద్ధం అవుతున్నారు.

 

అమెరికాలో జరుగుతున్న ఈ కార్యక్రమం ప్రవైటుది అయినా సరే  ట్రంప్ ఈ సభా వేదికని మోడీ తో కలిసి పంచుకోనున్నారు. అమెరికాలో ఉన్న లక్షలాది భారతీయుల బలాన్ని ఈ వేదికగా చూపించాలని ఇండో అమెరికన్స్ భారీ వ్యూహాలతో సిద్దం అయ్యారు. ట్రంప్ ఈ కార్యక్రమానికి రానుండటంతో భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ కార్యక్రమం నిర్వహించే ప్రాంత పరిధిలో భారీ వర్షాలు పడటంతో పాటు వరద ముంచెత్తింది.

 

ఈ పరిణామాలతో టెక్సాస్ గవర్నర్ 13 కౌంటీలలో అత్యావసర పరిస్థతి విధించారు. ఎవరూ కూడా బయటకి రావద్దు అంటూ ప్రచారం చేశారు. దాంతో భారీగా ఏర్పాటు చేసుకున్న హౌడీ మోడీ కార్యక్రమంపై ఆందోళన చెందుతున్నారు నిర్వాహకులు. అయితే ఈ సభ 23 వ తేదీన కావడంతో అప్పటికి పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: