మెక్సికోలో అక్రమంగా ఉంటున్న 300 మందికి పైగా భారతీయులను ఆ దేశం వెనక్కిపంపింది. 311 మంది భారతీయులను మెక్సికన్ అధికారులు తమ దేశం నుంచి భారత్ కు పంపేశారు. మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారంటూ కొంతకాలంగా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ మెక్సికోపై రంకెలు వేస్తున్న సంగతి తెలిసిందే.


అలా అగ్రరాజ్యం అమెరికా ఒత్తిడి తీసుకువస్తుండంతో మెక్సికో అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మెక్సికో ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మెక్సికోలో ఉండేందుకు సరైన పత్రాలు లేని 311 మంది భారతీయ పౌరులను విమానం ఎక్కించే ఇండియా పంపించేశారు.


మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలోకి కొనసాగుతున్న అక్రమ వలసలను నిరోధించకపోతే మెక్సికో నుంచి దిగుమతయ్యే వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే మెక్సికో ఈ తనిఖీలు చేపట్టింది. చివరకు బారతీయులను ఇంటికి పంపేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: