అమెరికాలో దీపావళి భారత్ లో కంటే మూడు రోజులు ముందుగానే మొదలు కానుంది. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు వైట్ హౌస్ లో అధ్యక్షుడు ట్రంప్ తో కలిసి ఈ వేడుకలు జరుపుకోనున్నారు.ఈ మేరకు వైట్ హౌస్ నుంచీ అధికారిక ప్రకటన వెలువడిందని భారత ఎన్నారైలు తెలిపారు.  అమెరికాలో ఉంటున్న ఎంతో మంది ప్రవాస భారతీయులు భారత సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడేట్టుగా పార్టీ పండుగను జరుపుకుంటూనే ఉంటారు. కానీ

 

ఒకే ఒక్క దీపావళి పండుగను మాత్రం అమెరికా అధ్యక్షుడితో కలిసి నిర్వహించుకోవడం గమనార్హం. ఇదిలాఉంటే గతంలో అంటే ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు నిర్వహించడం మొదలు పెట్టారు. ట్రంప్ హయాంలో సైతం ఆనవాయితీగా  దీపావళి వేడుకలు 2017 నుంచీ కొనసాగాయి.

 

గత ఏడాది 2018 లో దీవాపాలి జరుపుకోవడానికి ట్రంప్ స్వయంగా ప్రవాసీయులని ఆహ్వానించారు. ఇప్పుడు కూడా ఈ వేడుకలు జరుపుకోవడానికి మూడు రోజుల ముందుగానే ప్రత్యేక ఆహ్వానాలు పంపారు వైట్ హౌస్ ఈవెంట్ మేనేజ్మేంట్. దాంతో దీపావళి ఘనంగా జరుపుకోవడానికి ప్రవాసీయులు సర్వం సిద్దం చేస్తున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: