మన దేశం అభివృద్ధి చెందుతుంది. అయితే ఏంటి ? పక్క దేశంలో వెళ్లి ఇదే పని చేస్తే ఇక్కడ వచ్చెదనికి రెండింతలు వస్తుంది అని వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లక తెలుస్తుంది.. మన దేశం విలువ.. అక్కడికి ఒక్కసారి వెళ్లక వాళ్ళు పెట్టె కష్టాలు తట్టుకోలేక.. ఇండియాకు తిరిగిరాలేక.. ఇబ్బందులు పాలవుతారు. అయితే ఉపాధి నిమిత్తం వెళ్లినవారు.. కుటుంబంతో కలిసి వెళ్ళలేరు కదా.. 


ఒక్కరే వెళ్తారు.. భారత్ లో ఉన్న కుటుంబానికి డబ్బు పంపుతారు. ఆలా వెళ్లిన వారు కొందరు బాగా కస్టపడి పని చేసి అంతో ఇంతో వెనకేసుకొని తిరిగి ఇంటికి వస్తారు. కానీ కొంతమంది మాత్రం అత్యాశకు పోయి నీచమైన పనులు చేసి ఆ దేశం నుండి స్వదేశానికి తిరిగి వస్తారు. ఈ నేపథ్యంలోనే ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా గనపవరం మండలని చెందిన ఓ మహిళా ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్ళింది. 


అయితే అక్కడ ఒక తెలుగువాడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త సహజీవనం అయ్యింది. దీంతో ఆ పరిచయానికి ప్రతీకగా ఆమె గర్భవతి అయ్యింది. అనంతరం ఓ ఆస్పత్రిలో ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ మరుసటి రోజే ఆ పిల్లడు ఆమె కన్నా కొడుకు అని మరిచిపోయి ఆ పిల్లాడిని వదిలేసి పోయింది. ఆ నీచపు తల్లి. దీంతో గత ఆరేళ్ళ నుంచి ఆ బాబు కువైట్ లోని ప్రభుత్వ అనాథాశ్రమంలో ఉంటున్నాడు. 


అయితే ఇలానే మరో మహిళా కూడా చేసింది. ఆమె కూడా తెలుగు ఆమె. ఓ పాపకు జన్మనిచ్చి రెండేళ్ల తర్వాత ఆ చిన్నారిని ఆస్పత్రిలో వదిలి పారిపోయింది. ఇద్దరు తెలుగువారే.. ఇద్దరు పిల్లలు ఇప్పుడు కువైట్ లోని అనాథాశ్రమంలో అనాథలుగా పెరుగుతున్నారు. అయితే ఇప్పుడు ఆ మహిళలు ఎక్కడున్నారు.. ఎవరు అనేది ఇంకా తెలియలేదు. 


కానీ పిల్లలను కానీ అంత నిర్ధాక్షిణంగా ఎలా వదిలేస్తారు ? కన్నా పేగు బిడ్డను వదిలేసే సమయంలో విలవిల్లాడదా ? అంత దారుణమా ? .. మీరు అంత నీచులు అయినప్పుడు పిల్లల్ని కనకండి.. పిల్లల్ని కానీ వారి జీవితాలు ఎందుకు సర్వనాశనం చేస్తారు.. అయినా రాసె వారి పిచ్చికాని.. ఈ మాటలు ఎన్ని సినిమాలలో చెప్పలేదు.. ఈ కాలం యువత అసలు వినే స్టేజిలో ఉందా ? వారు ఎలాగో వినారు.. కనీసం ఈ ఆర్టికల్ చదివిన వారైనా నలుగురిని మార్చడానికి ప్రయత్నించండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: