మహిళ రోడ్డుపై వెళ్తుంటే అందరి చూపు ఎక్కడ ఉంటుంది. ఈ ప్రశ్న కి రకరకాల సమాధానాలు ఇస్తారు ఎవరిని అడిగినా, కానీ అందరి చూపు అక్కడే ఉంటుంది అంటూ ఓ మహిళ బల్ల గుద్దిమరీ చెప్తోంది. అంతేకాదు తాను ఇది ప్రయోగాత్మకంగా చేశానని చెప్తూనే మరో షాకింగ్ విషయం కూడా బయటపెట్టింది. ఇంతకీ ఆమె ఎందుకు ఈ ప్రయత్నం చేసింది. ఈ ప్రయోగంలో ఆమె ఏమి గమనించిందో మనమూ ఓ లుక్కేద్దాం.

 

విట్నీ జెలిగ్ అనే మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన పెంచడానికి ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా ఒక మహిళ రోడ్డుపై వెళ్తుంటే అందరూ ఆమెలో ఏ ప్రదేశంలో ఎక్కువగా చూస్తున్నారో అని తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. అనుకున్న పళంగా ఆమె తన బ్రా లో సీక్రెట్ కెమెరా అమర్చింది. అలాగే రోడ్డుపైకి వెళ్లి మళ్ళీ కాసేపటికి తిరిగి వచ్చేసి కెమెరాలో వీడియో చూసి షాక్ అయ్యింది.

 

ఆమె నడుస్తూ వెళ్తుంటే మగవారు ఆమె వక్షోజాల వైపు ఆసక్తిగా చూసినట్టు గమనించిన ఆమె, ఆడవారు సైతం ఆమె వక్షోజాల వైపు తదేకంగా చూడటంతో ఆమెకి షాక్ అయ్యింది. అంతేకాదు చివరికి కుక్కలు సైతం ఆమె వక్షోజాలవైపు ఆసక్తిగా చూశాయట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మహిళలు సైతం నా వైపు చూడటం ఆసక్తిగా మారింది. అయితే మహిళలు తమ తమ వక్షోజాలపై దృష్టి పెట్టి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోండి అంటూ హెచ్చరిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: