భారతీయులకి అమెరికా కల కలగానే మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు టెక్ నిపుణులు. హెచ్1 – బి వీసా వీసా విషయంలో ట్రంప్ ముందు నుంచీ కటినమైన వైఖరినే అవలంభిస్తున్నారు. స్వదేశంలో ఉన్న వారు ఉద్యోగాల కల్పనలో వెనుక పడటానికి అవకాశాలు కోల్పోవడానికి కారణం విదేశీయులేనని ముఖ్యంగా వారిలో భారతీయులు అధికంగా ఉన్నారని భావించిన ట్రంప్ వీసాల జారీ  విషయంలో ఎన్నో నిభందనలు తీసుకువచ్చారు. అయితే తాజాగా

 

అమెరికా ఇమ్మిగ్రేషన్ పాలసీ లెక్కల ప్రకారం చూస్తే 2015 లో వీసా దరఖాస్తులకంటే కూడా 2019 లో వీసా దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గిందని ప్రకటించింది. దాదాపు 70 శాతం మంది అభ్యర్ధుల పత్రాలు తిరస్కరించారని అందులో అత్యధికులు భారతీయులేనని వెల్లడించింది. అయితే అందుకు గల కారణం కేవలం ఐటీ సంస్థలపై విధిస్తున్న ఆంక్షలేనని తెలిపింది. అత్యధికంగా కాగ్నిజెంట్ కంపనీ దరఖాస్తులు తిరస్కరణకి లోనయ్యయాని తెలుస్తోంది.

 

అంతేకాదు విప్రో, ఇన్ఫోసిస్ వంటి పలు కంపెనీలపై కూడా ఈ ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది.ముఖ్యంగా ఈ ప్రభావం భారతీయ కంపీలపైనే ఉంటుందని, స్థానిక టెక్ కంపెనీలపై ఈ ప్రభావం  ఉండే అవకాశాలు లేవని అంటోంది. ఏది ఏమైనా ట్రంప్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అమెరికా పౌరుల మనసు గెలుచుకోవడానికి ఎలాంటి సహస నిర్నయాలైన తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: