ఆర్టికల్ 370 రద్దు తమ సర్కారు చేసిన సాహసోపేతమైన నిర్ణయమని మోడీ అన్నారు. థాయ్ లాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. తాము చేసిన పనికి ప్రపంచమంతా జేజేలు పలుకుతోందన్నారు. కాశ్మీర్ విషయంలో మోడీ థాయ్ లాండ్ పర్యటనలో ఉద్వేగ భరితంగా ప్రసంగించారు.


మూడురోజుల థాయ్ లాండ్ పర్యటనలో భాగంగా.... బ్యాంకాక్ లో ప్రవాస భారతీయులు నిర్వహించిన సావాస్ దీ మోడీ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్ - థాయిలాండ్ ల సంబంధాలు.. కేవలం ఒక్క ప్రభుత్వం వల్ల బలపడలేదన్నారు. గతంలో ఇరుదేశాలు పంచుకున్న సమయం వల్లే సంబంధాలు బలపడ్డాయని ఆయన చెప్పారు.


ఇరుదేశాలు చేరువ కావడానికి భాషే కాకుండా విశ్వాసాలు కూడా కారణమని ప్రధాని మోడీ తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 60 కోట్ల మంది ఓట్లేశారని.. ఇది ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే అతిపెద్ద సంఘటనగా ప్రధాని నరేంద్ర మోడీ వర్ణించారు. భారత్ తో థాయిలాండ్ రాజ వంశీకుల మధ్య ఉన్న స్నేహాన్ని, చారిత్రక సంబంధాలకు ప్రతీకగా ఆయన పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: