భారతీయులకు అమెరికాలో ఉండేందుకు హెచ్‌-1బీ వీసాలు రాక, సంవత్సరాల పాటు గ్రీన్ కార్డు కోసం తెగ ఇబ్బంది పడుతుంటారు. అలాంటి భారతీయులు అమెరికాలో ఉండేందుకు ఇప్పుడు ఈ-2 వీసా ఓ మంచి అవకాశంగా కనిపిస్తుంది. ఈ-2 వీసా అనేది పేరుకే వీసా అయినా కూడా వాస్తవంగా ఇది ఒక వ్యాపారం. 


అమెరికాలో లక్ష డాలర్లు అంటే 70 లక్షలు పెట్టుబడి పెట్టి ఓ వ్యాపారాన్ని అమెరికాలో ప్రారంభిస్తే అక్కడ పని చేసుకునేందుకు ఈ ఈ-2 వీసా లభిస్తుంది. ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం కూడా చాల ఈజీ. ఎవరైనా ఈ-2 వీసా పొందాలంటే మొదట గ్రెనెడా, టర్కీ లేక మాంటెనీగ్రో మొదలైన దేశాల్లో వీసాకు అప్లై చేసుకోవాలి. 


వీటికి వీసా లభించేకి కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత అక్కడ నుండి ఈ-2 వీసాతో ఈజీగా అమెరికాకు వెళ్ళచ్చు. మొదట 5 సంవత్సరాలకు ఈ విసాని జారీ చేస్తారు. అనంతరం దాన్ని అలానే జీవితకాలమంతా పొడికించుకోవచ్చు. 


అయితే ఈ వీసాతో భార్యాబిడ్డలకు కూడా అమెరికాకు వెళ్లి అక్కడ ఉండేందుకు అవకాశం ఉంటుంది. అయితే పుట్టిన పిల్లలు మాత్రం వారికి 21 ఏళ్లు వయసు వచ్చాక మళ్లీ ఆ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ-2 వీసా ద్వారా గ్రీన్‌కార్డు లేదా పౌరసత్వం లభించకపోయిన  కానీ శాశ్వతంగా ఏ ఇబ్బందులూ లేకుండా అమెరికాలోనే ఉండిపోవచ్చు. 


అయితే అక్కడకు ఈ-2 వీసాతో వెళ్లిన వ్యక్తి స్థాపించిన వ్యాపార సంస్థ బాగా పెద్దదైనపుడు, అది అమెరికా ఆర్థికవృద్ధికి కూడా సహాయపడి ఆ సంస్థ యాజమాన్యం కీలక వ్యక్తులు గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. హెచ్‌-1బీ వీసా కోసం ఎదురు చూసే వారు ఈ-2 వీసా పైనా ఓ లుక్ వెయ్యండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: