అమెరికాలో నివసించే ఇండియన్స్ కు ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్.. హెచ్ 1బీ వీసాదారుల భార్యల వర్క్ పర్మిట్లను రద్దుచేయాలన్న ప్రతిపాదనను అమెరికా న్యాయస్థానం తిరస్కరించింది. హెచ్ 1 బీ వీసాదారుల భార్యలు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతిస్తూ 2015లో బరాక్ ఒబామా నిర్ణయం తీసుకున్నారు.


ఈ నిర్ణయం చాలామంది భారతీయులకు వరంగా మారింది. వీసాదారుల భార్యలు కూడా అక్కడ ఉపాధి అవకాశాలు పొందేవారు. వీరికి హెచ్ 4 వీసాలు జారీ చేసేవారు. వీటి ద్వారా అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వారికి అవకాశం లభించేది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ అవకాశాన్ని రద్దు చేశారు.


దీంతో చాలా మంది కోర్టులకు వెళ్లారు. అన్ని అంశాలను పరిశీలించిన కోర్టు ట్రంప్ సర్కార్ ఆదేశాల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని దిగువ కోర్టును కోరింది. నిబంధనల్ని క్షుణ్నంగా పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని సూచించింది. దీంతో అమెరికాలో నివశిస్తున్న వేలాదిమంది భారతీయులకు తాత్కాలిక ఉపశమనం కలిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: