అవును ఇప్పుడు ఒక పండు పాకిస్తాన్ ను వణికిస్తోంది. ఆ పండు ధరలు దిగిరాక కొనుగోళ్లు మందిగించి పోయాయి. ఇంతకీ ఆ పండు ఏంటో తెలుసా.. తినే పండు కాదండీ వంటల్లో వేసుకునేది. అదే టమాటా పండు. అవును మరి పాకిస్తాన్ లో టమోటా ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయట.


పాక్ లోని పలు ప్రాంతాల్లో టమోటా ధరలు కిలో 180 రూపాయల నుంచి 3వందల రూపాయలకు చేరుకుందట. అందుకే ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి టమోటాలను దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ తో వ్యాపార సంబంధాలను పాకిస్తాన్ తెంచుకుంది. ఇక్కడి నుంచి టమోటా ఎగుమతులు నిలిచిపోయాయి.


భారీ వర్షాలతో టమోటా పంట దెబ్బతినడం, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో సమస్య మరింత పెరిగింది. దీంతో టమాటా సరఫరా పూర్తిగా మందగించింది. ఇలాంటి సమయంలో అందుబాటులుో ఉన్న అన్ని చర్యలు పరిశీలిస్తోంది. మరి ఈ టమాటా రేట్లు ఎప్పుడు దిగివస్తాయో..


మరింత సమాచారం తెలుసుకోండి: