ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తుంది. పెద్ద ఉద్యోగం.. మంచి జీతం వస్తుంది. సాధారణ మహిళలు అయితే నేను సాధించా మంచి జీవితం అని అనుకుంటారు. కానీ ఆమెకు మాతృభూమికి ఏదైనా చెయ్యాలి అనిపించింది. ఆలా అనిపించడం ఆలస్యం ఇలా అమెరికాలో ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసింది. 


అంతే వెంటనే మాతృభూమికి తిరిగి వచ్చెసింది. తల్లిదండ్రులకు ఆమె నిర్ణయం చెప్పింది. ఆమె మతాల వెనుక ఉన్న పట్టుదలను గమనించి ఆమెకు అండగా నిలిచారు. 2010లో తిరిగి స్వదేశానికి వచ్చిన ఆమె రెండేళ్ల పాటు రకరకాల పరిశోధనలు చేసి ఎలాంటి బిజినెస్ పెడితే బాగుంటుంది అని ఆలోచించింది. 


చివరికి 2012లో వేస్ట్‌మేనేజ్‌మెంట్‌లో అడుగుపెట్టాలని నిర్ణయిం తీసుకుంది. ఇంకా వెంటనే హైదరాబాద్ శివారులో ఉన్న తన తండ్రి పొలంలో  'అహూజా ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్'ను స్థాపించింది. దానిలో సేంద్రియ వ్యర్థాలను ఉపయోగించి గ్యాస్ ఉత్పత్తి చేయడం మొదలెట్టింది.


ఎవరికీ పెద్దగా పరిచయం లేని ఈ ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎన్నో కష్టనష్టాలను భరించి నేడు తన రంగంలో ఓ విన్నర్‌గా నిలిచింది. ఒక్కసారి మార్కెట్లోకి అడుగు పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఆమెకు రాలేదు. దీంతో ప్రస్తుతం ఆమె బిజినెస్ దేశవ్యాప్తంగా 16చోట్ల బ్రాంచిలతో అద్భుతంగా నడుస్తోంది. 


ఈ కంపెనీల్లో ఇప్పటివరకు సుమారు 12వేల టన్నుల సేంద్రియ వ్యర్థాలను వినియోగించి వాటి ద్వారా 600 టన్నులపైగా ఎల్‌పీజీ గ్యాసును ఆదా చేయగలిగింది. అంతేకాదు 4లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తిని నివారించగలిగారు. ఆమె ఎవరో కాదు.. ఆమె పేరు శృతి అహుజా.. పక్క దేశంలో ఉద్యోగానికి రాజీనామా చేసి తన దేశంలోనే బిజినెస్ ప్రారంభించి ఎంతోమందికి ఉపాధి కల్గించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: