భారతీయులు ఉపాధి నిమిత్తం దేశం దాటుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆలా దేశం దాటే సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి చదువుకున్నవారు అమెరికాకు వెళ్తే ఎక్కువశాతం మంది చదువు కొని వారు ఉపాధి నిమిత్తం అరబ్ దేశాలకు వెళ్తారు. అలానే చాలామంది కువైట్ కి వెళ్లి అక్కడ బాగా సంపాదించి వెనక్కి వస్తారు. కానీ ఐదుగురు భారతీయులు కువైట్ కి వెళ్లి నకిలీ సర్టిఫికెట్లతొ ఉద్యోగాలు చేస్తున్నారు...  


ఒక్క మన ఐదుగురు భారతీయులు మాత్రమే కాదు ఒక సిరియన్ వ్యక్తిని కూడా కువైట్ ఇంజినీర్స్ సొసైటీ (కేఈఎస్) గుర్తించింది. వీరందరూ నకిలీ సర్టిఫికెట్లను సమర్పించి కువైట్‌లోని ఆయిల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించినట్టు కేఈఎస్ చెబుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో అనేక మంది కువైట్‌లో ఉద్యోగాలు పొందుతున్నట్టు కేఈఎస్ అనుమానిస్తోంది. 


ఇలా చేసే వారందరినీ గుర్తిస్తామని కేఈఎస్ వెల్లడించింది. అంతేకాదు ఈ ఆరుగురిని తదుపరి చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపినట్టు కేఈఎస్ అధికారులు తెలిపారు. మరి అందుకే నకిలీ సర్టిఫికెట్లతొ పరాయి దేశాలకు వెళ్లి అబాసుపాలయ్యేకంటే.. నీతిగా నిజాయితీగా మన దేశంలోనే చిన్న ఉద్యోగం అయినా సరే చేసి కుటుంబంతో సంతోషంగా జీవించడం ఎంతో ఉత్తమం. 


మరింత సమాచారం తెలుసుకోండి: