చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం అని అంటుంటారు. నిజమే అండి బాబు.. పిల్లలు కల్మషం లేకుండా ఉంటారు. వారు చేస్తున్న పని మంచిదా ? చెడుదా ? అనేది పిల్లలకు తల్లిదండ్రులు చెప్తే కానీ తెలియదు. ఆలా చెప్పాల్సిన తల్లిదండ్రులే తప్పు చేస్తే అది సరిదిద్దుకోవాలి కదా..     

 

అలానే అమెరికాలో ఓ అయిదేళ్ల బుడతడు తనకు తెలీకుండా తన తండ్రిని జైలుకు పంపించాడు. ఇంకా విషయానికి వస్తే.. అమెరికాకు చెందిన బెన్నీ గార్సియాకు ఒక అయిదేళ్ల కొడుకు ఉన్నాడు. ఆ కొడుకే తండ్రి నిర్వాకాన్ని బయటపెట్టాడు. తండ్రి బెన్నీ గార్సియా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు.     

 

ఎన్నో సంవత్సరాల నుండి ఈ డ్రగ్స్ సరఫరా చేసినప్పటికీ ఎప్పుడు పోలీసులకు దొరకలేదు. కానీ అతడి కొడుకు వల్లే అనుకోని రీతిలో డ్రగ్స్ సరఫరా విషయంపై పోలీసులు పట్టుకున్నారు. ఎలా అనుకుంటున్నారా ? ఎం లేదండి.. ఆ బుడతడు ఇంట్లో ఉన్న డ్రగ్స్ పాటలన్ని బ్యాగులో పెట్టుకొని తీసుకెళ్లాడు.       

 

దీంతో ఆ బ్యాగులో ఓ పౌడర్ ఉందని.. అది తిన్నాక తాను సూపర్ మ్యాన్‌లా మరిపోయానని తోటి విద్యార్థులకు చెప్పాడు. ఈ విషయం విన్న టీచర్ అతని బ్యాగును పరిశీలించగా అందులో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్కూలుకు వచ్చిన పోలీసులు పిల్లోడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. 

 

అనంతరం పిల్లోడితో పాటు ఇంటికి వెళ్లారు. పోలీసులను చూసిన పిల్లోడి తల్లి ఆందోళన చెందింది. పిల్లోడి తండ్రి బెన్నీ గార్సియా బెడ్‌రూంలో నిద్రిస్తుండగా అదే బెడ్ రూమ్ లో పోలీసులకు దాదాపు 200 బ్యాగుల డ్రగ్స్ దొరికాయి. దీంతో బెన్నీ గార్సియాను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇలా పట్టించేశాడు ఆ బుడతడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: