మనదేశంలో విదేశాల్లో ఉద్యోగం చేసుకునే ఇండియ‌న్ అబ్బాయిలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడట... నెలకు నాలుగు లక్షల జీతం ఆట... ఇంకేముంది ఇక్కడ కూడా ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి... పైగా ఒక్కడే కొడుకు కూడా... అలాంటి అబ్బాయికి మా అమ్మాయిని పెళ్లి చేస్తే ఎంతో సుఖ‌పడుతుందని ఆడపిల్లల తల్లిదండ్రులు నిన్నమొన్నటివరకు కలలు కనేవారు. అయితే ఇప్పుడు ఆ డాలర్ డ్రీమ్స్ ఒక్కొక్కటిగా కనుమరుగైపోతున్నాయి. ఆడపిల్లల తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ పిల్లల కోసం లక్షలు... కోట్లలో కట్నాలు ఇచ్చి... భారీగా బంగారం పెట్టి విదేశీ భర్తలపై మోజు ప‌డుతుంటే వారు పెళ్లయ్యాక అక్కడ ఆ భ‌ర్త‌లు పెట్టే టార్చ‌ర్‌ తట్టుకోలేక ఎంతోమంది అమ్మాయిలు అసలు జీవితం అంటేనే విర‌క్తి చెందే స్టేజ్‌కు వచ్చేస్తున్నారు.

 

భవిష్యత్తులో కూడా తమకు పెళ్లి వద్దు అని ఎన్నారై భర్తల‌ ను పెళ్లి చేసుకుని.. హింస అనుభవిస్తున్న కొంతమంది అమ్మాయిల చెబుతున్నారంటే ఎన్నారై భర్త ల పైశాచిక‌త్వం ఎలా ఉందో ? తెలుస్తోంది. అంటే అంద‌రు ఎన్నారై భ‌ర్త‌ల‌ను ఈ విష‌యంలో ఒకే గాటాన క‌ట్ట‌లేం. కొంత మంది మాత్ర‌మే త‌మ విప‌రీత ప్ర‌వ‌ర్త‌న‌తో భార్య‌కు న‌ర‌కం చూపించేస్తున్నారు.

 

విదేశాల్లో ఉన్న భారతీయ మహిళలకు భద్రత కల్పించే విధంగా అప్పటి కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం విదేశాల్లోని భారతీయ మహిళలు గృహహింస, వరకట్న వేధింపులకు గురవుతే.. భర్తలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అంత‌కు ముందు వ‌ర‌కు ఎన్నారై భ‌ర్త‌ల‌పై ఫిర్యాదు చేసే ఛాన్స్ కూడా ఉండేది కాదు.. దీంతో వారు మ‌రింత‌గా పేట్రేగి పోయేవారు. 

 

ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత గత నెల వరకు భారీగా ఫిర్యాదులు అందినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. గత నాలుగేళ్లలో.. 2015 నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకు ఆరువేలకు పైగా ఫిర్యాదులు అందాయి. ఈ ఏడాది అక్టోబరు చివరి నాటికి 991 ఫిర్యాదులు వచ్చాయి. 2018లో 1,299కేసులు నమోదైయ్యాయి. 2017లో 1,498 ఫిర్యాదులు, 2016లో 1,510, 2015లో 796 ఫిర్యాదులు అందాయని విదేశాంగశాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: