ఓ డ్యాన్స్ టీచర్ చేసిన ఛండాలం ఇది.. ఎయిడ్స్ ఉందన్న విషయాన్నీ దాచిపెట్టి అతికిరాతకంగా ప్రవర్తించాడు. ఆ ప్రవర్తనకు టీనేజ్ బాలిక జీవితం చిన్నాభిన్నమైంది. ఈ మధ్యాకాలంలో ఇలాంటి కీచకులు ఎక్కువ మందే ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రేమ దోమ అంటూ వెంటపడి బాలికల జీవితాన్ని బాలి తీసుకుంటుంటారు కొందరు ఎదవలు.  

 

ఈ నేపథ్యంలోనే అమెరికాలోని టెనస్సీలో ఓ అతికిరాతకంగా ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. టెనస్సీలోని షెల్బీ కౌంటీకి చెందిన జాన్‌ కాన్నర్‌కు 2015లో సోషల్‌ మీడియాలో ఓ టీనేజర్‌‌తో పరిచయం ఏర్పడింది. దీంతో జాన్నర్‌ ఆ టీనేజర్‌‌ను తాను నడుపుతున్న 'బ్రింగ్‌ ఇట్‌' డ్యాన్స్‌ బృందంలోకి తీసుకున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం బాగా పెరిగింది. 

 

అనంతరం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరు చివరికి వారి వ్యక్తిగత విషయాలను, పోటోలను సైతం ఇద్దరు షేర్ చేసుకున్నారు. అనంతరం ఇద్దరు కాన్నారు కారులోనే టీనేజేర్ పై పలుమార్లు అసహజ పనులు చేశారు. అయితే కాన్నర్‌కు ఎయిడ్స్ ఉందన్న విషయం టీనేజేర్ కు ఆలస్యంగా తెలిసింది. దీంతో ఆ టీనేజేర్ భయపడి ఆ విషయాన్నీ ఇంట్లో కుటుంబసభ్యులకు చెప్పింది. 

 

దీంతో టీజనేర్‌ను పేరెంట్స్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా ఆ టీనేజర్ కి అప్పటి ఎయిడ్స్ సోకింది అని టెస్టుల ద్వారా వైద్యులు నిర్ధారించారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించి కార్నర్ పై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కాన్నర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

 

2012లోనే కాన్నర్‌ హెచ్‌ఐవీ బారినపడినప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి టీనేజర్‌పై అసహజమైన చర్యకు పాల్పడ్డాడు. పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించిన అతడ్ని జైలుకు తరలించారు. ప్రస్తుతం కార్నర్ జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అటు టీనేజర్ పరిస్థితి మాత్రం ప్రస్తుతం దారుణంగా ఉంది.. అందుకే సోషల్ మీడియా పరిచయాలకు దూరంగా ఉంటె ఎంతో మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: