కొంతమందికి అలెర్జీల కారణంగా కొన్ని కొన్ని వంటలు తినలేరు కూడా. అసలు ఆ ఫుడ్ ఉంది అంటే చాలు అమాడు దూరం పారిపోతారు. ఈ నేపథ్యంలోనే ఓ యువతీకి పాడనీ ఆహరం ఆ విమానంలో ఉండటంతో ఆమెను అర్దాంతరంగా విమానం నుండి దింపేశారు. అసలు కథ ఏంటంటే .. 

 

ఇంకా వివరాల్లోకి వస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ జంట.. ఆగ్నేయాసియా దేశాల పర్యటన కోసం ప్లాన్ వేసుకుంది. దీనికోసం దాదాపు రెండేళ్లు కష్టపడి 6500డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాల రూ.4.6లక్షలపైగా ఆమె కూడబెట్టింది. ఆ సొమ్ముతో ట్రిప్‌కు వెళ్దామని నిర్ణయించుకుంది. 

 

అయితే అంతా పక్కాగా ప్లాన్ ప్రకారం సిద్ధం చేసుకున్నా కూడా.. ఆంథోనీ బర్న్స్, కర్ట్నీ వార్డ్ దంపతుల హాలీడే ట్రిప్ సంతోషంగా జరగలేదు. అర్ధాంతరంగా మధ్యలోనే ముగిసింది. ఈ ట్రిప్ ఆగిపోవడానికి కారణం అంథోని భార్య కర్ట్నీకి ఉన్న ఫుడ్ అలర్జీనే. ఆమెకు నట్స్ ఎలర్జీ ఉంది. 

 

ఈ అలర్జీ వల్ల ఆమెకు జీడిపప్పు, బాదంపప్పు, వేరుశనగ తదితర  వంటి నట్స్ పడవు. వాటి వాసన చూసినా సరే గొంతు వాచిపోవడం, వాంతులు, తలనొప్పి వచ్చేస్తాయి. దీంతో అటువంటి ఆహారాలు ఏవీ ఉండని విమానంలో ప్రయాణించడమే మేలని ఆంథోనీ దంపతులు భావించారు. 

 

దీంతో అలాంటి విమానం కోసం రీసెర్చ్ చేసి.. ఇలా ఆలర్జీలు ఉన్న ప్రయాణికులను కాంతాస్ ఎయిర్‌లైన్స్ జాగ్రత్తగా చూసుకుంటుందని తెలుసుకున్నారు. ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి ఆతర్వాత విమాన టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే తీరా విమానం ఎక్కిన తర్వాత ఫుడ్ మెనూలో జీడీపప్పు చికెన్ వంటకం చూసి కర్ట్నీకి నోటమాటరాలేదు. 

 

సిబ్బందిని పిలిచి దానిగురించి ప్రశ్నించగా, దానిలో జీడిపప్పు ఉంటాయని చెప్పారు. దీంతో తమ హాలీడే ప్లాన్స్ కాస్త ఆవిరైపోయాయని ఆ దంపతులు నిరుత్సాహపడ్డారు. దీనికి కారణం తానేనని కర్ట్నీ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఆమె ఎలర్జీ విషయం తెలుసుకున్న విమాన సిబ్బంది ఆమెను విమానం నుంచి సీఎంపై వారికి క్షమాపణలు చెప్పారు. అనంతరం ఆ కాంతాస్ ఎయిర్‌లైన్స్ వారి టికెట్ డబ్బులు రిటర్న్ ఇచ్చేసింది. దీంతో కర్ట్నీ కన్నీళ్లను కాస్త ఆపేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: