అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే తాజాగా ఎదురు చూసే వారికి అది తీరని కలగానే మిగిలిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న విదేశీయులలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య దాదాపు 40 లక్షల పైమాటేనట. ఈ విషయం అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం కలలుగనే వారికి ఆందోళన కలిగించవచ్చు. అయితే

Image result for green card indians

గత పదేళ్లుగా గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న భారతీయులకి తప్పకుండా శాశ్వత నివాసం పొందే అవకాశం ఉందని అయితే వారికి కూడా తమ వంతు రావాలంటే సమయం అధికమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు నిపుణులు. అయితే ఈ 40 లక్షల మందిలో అత్యధికులు భారతీయులేనట. సుమారు 2,27,000 మంది భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారని తెలుస్తోంది. ఇది కేవలం చూచాయిగా మాత్రమేనట.

 

ఇక మెక్సికో భారత్ తరువాతి స్థానంలో ఉండగా, చైనా సుమారు 1,80,000మందితో మూడవ స్థానంలో ఉండటం గమనార్హం. ఇదిలాఉంటే అమెరికాలో గతంలోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న వారు వారి వారి కుటుంభ సభ్యులు అంటే ప్రస్తుతం శాశ్వత నివాసం కోసం వేచి చూస్తున్న వారికి స్పాన్సర్ చేస్తే వారు కూడా శాశ్వత నివాసం పొందే అవకాశం ఉండేది కానీ ట్రంప్ అధికారంలోకి రాగానే ఈ విధానాన్ని పక్కన పెట్టేశారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: