అమెరికాకి వెళ్లి స్థిరపడేవారిలో ఇండియన్స్ చాలా ఎక్కువ.. ఈ విషయాన్ని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ట్రంప్ పదే పదే ఇండియన్ యూత్ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ఆయన మరోసారి భారతీయ యువతకు షాక్ ఇచ్చారు. 2017లో తీసుకు వచ్చిన కొత్త చట్టంవల్ల హెచ్ ఒన్ బి వీసాలు భారత్ కు మంజూరు అవడం బాగా తగ్గిందని ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రకటించింది.

 

అమెరికాలో స్థానిక వ్యాపారాలు పెంచడానికి ఆయన ఈ చట్టం తీసుకువచ్చారు. దీని ప్రభావం భారత్ పై ఎక్కువగా పడిందట. రెండేళ్లలో భారతీయ కంపెనీలు పొందే హెచ్-1బీ వీసాల్లో గతంతో పోలిస్తే బాగా తగ్గాయని ఆ సంస్థ తెలిపింది. తొలి పది స్థానాల్లో ఉండే భారతీయ సంస్థలు 2016లో 51శాతం వీసాలు పొందగా.. 2019కి వచ్చేనాటికి ఆ మొత్తం 24శాతానికి పడిపోయిందని అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ కూడా వెల్లడించింది.

 

భారతీయులకు జారీ చేసిన హెచ్-1బీ వీసాల్లో చాలా వరకు అమెరికా కంపెనీలు వెళ్లాయి. అతి తక్కువ మాత్రమే భారతీయ కంపెనీలకు వెళ్లాయి. అమెరికా కంపెనీలు దరఖాస్తు చేసిన వాటిల్లో 99శాతం వీసాలు వచ్చాయని ఈ వార్తా సంస్థ తన కథనంలో తెలిపింది. ఇది నిజంగా షాకే కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: