తెలుగువారికి అత్యంత ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగ రోజున  తెలుగు లోగిళ్ళు రంగవల్లులతో ఎంతో అందంగా ముస్తాబవుతాయి. గంగిరెద్దులు, కోడిపందాలు, ఆట పాటలు ఇలా ఒకటికాదు రెండు కాదు ఎన్నో ఎన్నెన్నో సంక్రాంతి పండుగలో భాగం అవుతాయి. అయితే తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే సంక్రాంతి పండుగని జరుపుకోకుండా ఉండరు.  ఈ క్రమంలోనే అమెరికాలోని తెలుగు సంఘాలలో ఒక్కటైన సెంట్రల్ ఒహియో తెలుగు సంఘం అమెరికాలో సంక్రాంతి వేడుకలు నిర్వహించడానికి ఇప్పటినుంచే సిద్దమవుతోంది.

 

2020 లో రాబోతున్న సంక్రాంతికి ముందుగానే శుభాకాంక్షలు చెప్తూ సంక్రాంతి లో ప్రధానభాగమైన ముగ్గులు, గాలిపటాలు, కోలాటం, వంటి కార్యక్రమాలలో పోటీలు ఏర్పాటు చేస్తూ ఆహ్వానం పలికింది. 2020 జనవరి 11 వ తారీకున నార్త్ వెస్ట్ చాపెల్ గ్రేస్ బ్రెత్రెన్ లో ఈ వేడుకల నిర్వహణకి సర్వం సిద్దం చేస్తోంది.

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ముగ్గుల పోటీలలో పెద్దలు, పిల్లలు ఎవరినా పాల్గొన వచ్చని, గాలిపటాల పోటీలలో కేవలం 15 ఏళ్ళ లోపు పిల్లలు మాత్రమే ఈ పోటీలకి అర్హులని తెలిపింది. కోలాటం పోటీలలో పెద్దవారు ఆరుగురు సభ్యులు కలిసి గ్రూప్ లుగా ఏర్పడి పోటీలలో పాల్గొనాలని తెలిపారు. అయితే ఈ పోటీలలో పాల్గొనే వారు తప్పకుండా ప్రవేశ రుసుము చెల్లించాలని అందుకుగాను ఏర్పాటు చేసిన బ్రోచర్ ని పరిశీలించాలని ప్రకటనలో తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: