అమెరికాలో ఇటీవ‌ల  హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ప్రతి లక్ష మందిలో 13 మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలా ఒకరు ఆత్మహత్య చేసుకుంటే, ఆ ప్రభావం వారి పిల్లలు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు, స్నేహితులు, సహచరులపై పడుతోంది. ఎంతోమంది పిల్లలు అనాథలవుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయితే తాజాగా అమెరికాలో ఓ తెలుగు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లాకు చెందిన గుమ్మడికాయల ద్వారకానాథ్ రెడ్డి గురువారం మధ్యాహ్నం బలవన్మరణం చెందాడు. 

 

ద్వారకానథ్ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్థిక సమస్యలు కానీ, వివాదాలు కానీ లేని ఈ యువకుడి ఆత్మహత్య మిస్టరీగా మారింది. ద్వారకానాథ్ రెడ్డి అమెరికాలో అమెజాన్ సంస్థలో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారత కాలమాన ప్రకారం గురువారం మధ్యాహ్నం సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు శుక్రవారం ద్వారకనాథరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక అతడి స్వస్థలం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం మట్లివారిపల్లె.

 

కాగా ద్వారాకనాథ రెడ్డికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, వివాదాలు కానీ లేవని బంధువులు స్ప‌ష్టం చేశారు. ఇక‌ ద్వార‌కానాథ రెడ్డి బలవన్మరణంతో అతని స్వస్థలంలో విషాదం నెలకొంది. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కాక‌పోవ‌డంతో ప్ర‌స్తుతం అత‌డి మ‌ర‌ణం పెద్ద మిస్ట‌రీగా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: