ఎనిమిదేళ్ల ర్యాన్ కాజీ తన యూ ట్యూబ్ ఛానెల్‌ లో 2019 లో 26 మిలియన్ డాలర్లు సంపాదించి,   ఈ  ప్లాట్‌ఫామ్‌లో అత్యధిక పారితోషికం పొందిన సృష్టికర్తగా నిలిచినట్లు ఫోర్బ్స్ పత్రిక బుధవారం ప్రచురించిన జాబితాలో తెలిపింది.  కాజీ, ఇతని  అసలు పేరు ర్యాన్ గువాన్, ఇప్పటికే 2018 లో వీడియో ప్లాట్‌ఫామ్‌లో అత్యధికంగా 22 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు ఫోర్బ్స్ తెలిపింది.

 

 

 

 

 

ర్యాన్ తల్లిదండ్రులు  అతని ఛానెల్ "ర్యాన్స్ వరల్డ్" ను 2015 లో ప్రారంభించారు. ప్రారంభించిన  మూడు సంవత్సరాలకే  ర్యాన్  ఛానల్  22.9 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్ లను కలిగి వుంది.  ప్రారంభంలో "ర్యాన్ టాయ్స్ రివ్యూ" అని పిలువబడే ఈ ఛానెల్ ఎక్కువగా చిన్న పిల్లల టాయ్స్ బాక్స్ లను  అన్బాక్సింగ్ చేసి వాటితో పిల్లలు ఆదుకునే  వీడియోలను కలిగి ఉండేది .  అనలిటిక్స్ వెబ్‌సైట్ సోషల్ బ్లేడ్  డేటా ప్రకారం, ర్యాన్ ఛానల్ లోని అనేక  వీడియోలు ఒక బిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ ని  సంపాదించాయి.  ఛానెల్ సృష్టించినప్పటి నుండి దాదాపు 35 బిలియన్ వ్యూస్ ని  అందుకుంది.

 

 

 

 

 

 

 

ట్రూత్ ఇన్ అడ్వర్టైజింగ్ అనే వినియోగదారుల న్యాయవాద సంస్థ దీని గురించి యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టిసి) కు ఫిర్యాదు చేసిన తరువాత ఇటీవల ఈ ఛానెల్ పేరు మార్చబడింది.    ఏ వీడియోలను ఏ బ్రాండ్‌ తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి  స్పాన్సర్  చేసిందో  ఛానెల్ స్పష్టంగా సూచించలేదని ట్రూత్ ఇన్ అడ్వర్టైజింగ్ ఆరోపించింది.  ఈ ఛానెల్ ర్యాన్ ఎజెస్ గా అభివృద్ధి చెందింది, ఇప్పుడు బొమ్మలతో పాటు మరిన్ని విద్యా వీడియోలను అందిస్తోంది.

 

 

 

 

 

ఫోర్బ్స్ ర్యాంకింగ్‌లో, ర్యాన్ కాజీ టెక్సాస్ నుండి వచ్చిన స్నేహితుల బృందం నడుపుతున్న "డ్యూడ్ పర్ఫెక్ట్" ఛానెల్‌ను అధిగమించింది, వీరు బాస్కెట్‌బాల్‌ లను భవనాల పై భాగాల నుండి లేదా హెలికాప్టర్ల నుండి హోప్స్‌లోకి లాంచ్ చేయడం వంటి అసాధ్యమైన విజయాలను ప్రయత్నిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: