అగ్ర రాజ్యం అమెరికాలో ఐదురుగు భారత ఎన్నారైల మూలంగా మరోసారి భారత పరువు నట్టేనా మునిగింది. ఎంతో మంది ఎన్నారైలు అమెరికాలో భారత కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేస్తుంటే కొందరు స్వార్ధ ప్రయోజనాల కారణంగా అరెస్ట్ ల పాలవుతూ పరువు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఐదుగురు భారతీయులని అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI ) అరెస్ట్ చేసింది. వివరాలలోకి వెళ్తే..

 

ఐదుగురు భారతీయులు సిలికాన్ వ్యాలీలోని ఒక క్లౌడ్  కంప్యూటింగ్ కంపెనీ ఆదాయ వివరాలు తెలుసుకున్నారు. దాంతో పలు మార్లు ట్రేడింగ్ జరపడం ద్వారా కోట్ల రూపాయలు లాబాలు ఆర్జించారు. ఈ విషయాన్ని సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్‌ కమిషన్ ( సెక్) లేవనెత్తి నేరారోపణ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నెల్లూరు జనార్ధన్ ఉండగా శివన్నారాయణ, గణపతి, సబేర్ , ప్రసాద్ లు కూడా ఉన్నారు.

 

ప్రధాన నిందితుడు అయిన జనార్ధన్ తనకి ఉన్న పరిచయాలతో తన కంపెనీ ఆర్ధిక పనితీరు, త్రైమాసికం వారీగా సేకరించాడని సెక్ పేర్కొంది. చివరికి జార్ధాన్ ని కంపెనీ విధుల నుంచీ తొలగించే వరకూ అతడు ఈ నేరాలకి పాల్పడుతూనే వచ్చాడని పోలీసులు తెలిపారు. అంతేకాదు ఎక్కడా కూడా తన కంపెనీ స్టాక్ పేరు పెట్టకుండా బేబీ గా వ్యవహరించేవాడని తెలిపారు. ఈ తప్పుడు విధానాల ద్వారా వీరు మొత్తం 49 కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని కంపెనీ పేర్కొంది. అయితే FBI విచారించిన తరువాత అతడు తన కుటుంభ సభ్యులకి విమాన టిక్కెట్లు కొనుగోలు చేయడంతో అతడిని విమానశ్రయంలోనే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అతడితో పాటు మిగిలిన వారిని కూడా FBI అదుపులోకి తీసుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: