అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఓ పట్టాన ఎవరూ నచ్చరు.ఒకవేళ నచ్చక పొతే ఎంత పెద్ద కీలక వదవిలో ఉన్నా సరే వెంటనే ఊడపీకేస్తారు. నచ్చితే శిఖరాన కూర్చోబెడుతారు. ఇప్పుడు అలాంటి సంఘానే జరిగింది. అమెరికాకి అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికన్ జాతీయ సైన్స్ ఫౌండేషన్ కి భారత సంతతి వ్యక్తిని ఎంపిక చేసిన ట్రంప్ త్వరలోనే ఆయనకి ఆ పదవిని కట్టబెట్టనున్నారు. వివరాలోకి వెళ్తే..

 

ప్రముఖ భారతీయ అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త అయిన సేతురామన్ పంచనాధాన్ ని అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్ కి డైరెక్టర్ గా నియమించారు. ఈ ఫౌండేషన్ అమెరికా సైన్స్, ఇంజనీరింగ్, వైద్య, విద్యా వంటి రంగాలలో అనూహ్యమైన మార్పులు తీసుకువచ్చేలా కృషి చేస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థకి డైరెక్టర్ గా పనిచేస్తున్న ఫాన్స్ కి చెందిన కొర్దివా తన ఆరేళ్ళ పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో..

 

భర్తీ కానున్న ఈ కీలక బాధ్యతలని సేతురామన్ చేపట్టనున్నారు. ప్రస్తుతం సేతు రామన్ ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో చీఫ్ వైస్ ప్రెసిడెంట్ గా మరియు  ఇన్నోవేషన్ ఆఫీసర్ గా సేవలు అందిస్తున్నారు.  2014 అంటే ఒబామా హాయంలోనే సేతురామన్ ని జాతీయ సైన్స్ కి సభ్యుడిగా నియమించారు. మళ్ళీ తిరిగి డైరెక్టర్ గా పదవిని అప్పగించడంతో ఆయన ట్రంప్ కి అభినందనలు తెలిపారు.అమెరికాలోని భారతీయ సంతతి ప్రజలు సేతురామన్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: