భర్తని వదిలి పక్కింటి కుర్రాడితో , లేదా భార్యని వదిలి ఎదురింటి ఆంటీ తో పెట్టుకుంటున్న ఎఫైర్ లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. భార్యా భర్తల మధ్య ఉండే గొప్ప అనుభంధం కాస్తా దారితప్పుతోంది. మారుతున్న టెక్నాలజీ కాలానికి ఇది రొటీన్ అయ్యిపోయింది. కానీ ఈ చేష్టలవలన పరువు పోవడమే కాకుండా కక్షలు పెంచుకుని చివరికి భర్త భార్యనో, లేక భార్య ప్రియుడినో చంపేసి ఎంచక్కా జైలులో ఊచలు లెక్క పెట్టుకోవడానికి కూడా సిద్దపడుతున్నారు. ఇలాంటి లవ్ ఎఫైర్ అమెరికాలో జరిగింది. కానీ ఇక్కడ జరిగిన ఓ సంఘటన భార్య ప్రియుడిని చంపాలని అనుకున్న భర్త కి షాక్ ఇచ్చింది. వివరాలోకి వెళ్తే..

 

అమెరికాలోని మిస్సోరికి చెందిన ఓ మహిళ తన భర్త కి హ్యాండ్ ఇచ్చి పక్కింటి అబ్బాయికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. కొన్ని నెలలుగా భర్తతో కాకుండా ప్రియుడితో చాటు మాటుగా వ్యవహారం కానిచ్చేస్తున్న ఆమె గుట్టు భర్త ముందు ఒక్కసారిగా రట్టయ్యింది. దాంతో ఎక్కడ జుట్టుపట్టుకుని బరబరా రోడ్డుమీదకి లాక్కుని వస్తాడోనని భయపడిన ఆమె ప్రియుడితో జెండా ఎత్తేసింది. దాంతో గుండె మండిన ఆ భర్త దుమ్ము పట్టిన తన తుపాకీ తీసుకుని భార్యని లేపుకుపోయిన ప్రియుడిని చంపాలని తిరుగుతూ ఉన్నాడు.

 

భార్య ఆమె ప్రియుడు బ్రూక్లిన్ లో ఉన్నారని తెలుసుకుని అక్కడే ప్రియుడిని చంపాలని వెళ్ళాడు భర్త. భార్య ప్రియుడితో ఉండటం చూసి ఒక్కసారిగా తుపాకి ఎక్కుపెట్టి చంపాలని ట్రిగ్గర్ నొక్కాడు, కానీ ప్రియుడికి ఇంకా నూకలు భూమిమీద ఉన్నాయి కాబోలు దుమ్ము పట్టిన తుపాకీ ట్రిగ్గర్ జామ్ అయ్యి షాక్ ఇచ్చింది. దాంతో  ప్రియుడు బ్రతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టాడు. దాంతో అతడి భార్య, పోలీస్ స్టేషన్ కి వెళ్లి భర్త పై కేసు నమోదు చేసింది. దాంతో పోలీసులు భర్త ని అరెస్ట్ చేసి కటకటాలలోకి నెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: