భారత ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ఇంటా బయట తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం విధితమే. అయితే ఈ బిల్లుపై అధికశాతం మంది సానుకూలత ప్రదర్సిస్తున్నా కొంతమంది మాత్రమే బిల్లుపై అనవసర చర్చలు ,గొడవలు చేస్తున్నారని బీజేపీ ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. అయితే ఇదే బిల్లుపై విదేశాలలో ఉంటున్న కొంతమంది ప్రవాసీయులు సైతం పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలోనే సౌదీలో...

 

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ప్రవాస భారతీయులు కొందరు ఓ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సు ఆదివారం రాత్రి రియాద్ నగరంలోని మలాజ్ అనే ప్రాంతంలో ఉన్న ఓ హోటల్ ఆడిటోరియంలో చట్ట సవరణ, మిధ్య అన్వేషణ అనే అంశంపై సంఘ్ పరివార్ కి చెందిన ఐదుగురు భారతీయులు సభని నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న వాళ్ళందరూ కేరళ ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది.

 

ఈ సభ నిర్వహణ  సమయంలోనే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్థానికంగా ఉన్న సౌదీ పోలీసులు సభావేదిక వద్దకి వెళ్లి అనధికారికంగా నిర్వహిస్తూ అల్లర్లు చేస్తున్న ఐదురుగు ప్రవాస భారతీయులని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. సౌదీ చట్టాల ప్రకారం అనధికారికంగా ఎలాంటి సభలు, ప్రదర్సనలు  నిర్వహించిన శిక్షార్హులు అవుతారని అందుకే అదుపులోకి తీసుకున్నామని సౌదీ పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే. అరెస్ట్ అయిన భారతీయులని కలవడానికి భారత ఎంబసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: