ప్రేమ పేరుతో ప్రస్తుత సమాజంలో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. అయితే ఎక్కువగా బాధితుల్లో అమ్మాయిలే ఉంటున్నారు. కొంతమంది అబ్బాయిలు ప్రేమ పేరుతో ముందే అమ్మాయిల జీవితాలతో వారి శరీరాలతో ఆడుకుంటూ నానా రీతుల్లో వాళ్లను వాడుకుంటూ చాలా మంది అబ్బాయిలు ప్రస్తుత సమాజంలో మోసం చేస్తున్నారు. ఇదే రీతిలో ఢిల్లీలో ఓ అమ్మాయి మోసగాడి చేతిలో ప్రేమలో పడి 15 లక్షలు పోగొట్టుకోవడం జరిగింది. అదిరిపోయే స్కెచ్ తో ఆమెకు ప్రేమ వల విసిరాడు. విషయంలోకి వెళితే ఢిల్లీలో పుట్టి పెరిగి మరియు సౌదీ ఎయిర్ లైన్స్ లో పనిచేస్తున్న ఉద్యోగి దగ్గర డబ్బు స్థాయిని చూసి మాస్టర్ ప్లాన్ వేశాడు.

 

పెళ్లి పేరుతో చాలా సందర్భాలలో ఆమె నుంచి భారీగా డబ్బులు గుంజే ప్రయత్నం చేసి ఆమె దగ్గర దాదాపు 15 లక్షల రూపాయలు కాజేశాడు. అయితే ఆమె ప్రేమ మత్తులో ఉండి అతడు చేసినది మోసం తెలుసుకోవటానికి చాలా సంవత్సరాలు పట్టింది. వివరాల్లోకి వెళితే, సౌదీ అరేబియాలోని ఆల్ రియల్ ప్రాంతానికి చెందిన అలీ ఆల్ ఖఫీ సలీం అలీ (30) హైదరాబాద్ లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. షేక్ పేట పారామౌంట్ కాలనీలో ఉంటున్నాడు. ఢిల్లీలో పుట్టి పెరిగి, సౌదీ ఎయిర్‌లైన్లో పనిచేస్తున్న యువతి (32)తో ఇతనికి 2015లో పరిచయం అయ్యింది.

 

పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆ యువతిని తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఎంతో కచ్చితంగా ఆలీ తనని పెళ్లి చేసుకుంటాడు అని గట్టిగా నమ్మకంతో వెంటనే ఆలీ తన పని స్టార్ట్ చేశాడు. అర్జెంటుగా డబ్బులు అవసరం అయ్యాయని 15 లక్షలు ఇస్తే బాగుంటుందని పలు దఫాలుగా మళ్లీ ఇచ్చేస్తానని తీసుకోవటం జరిగింది. అయితే ఆ తర్వాత డబ్బు తీసుకున్న తరువాత ఆమెకు ముఖం కనబడకుండా అడ్రస్ తెలియకుండా కొన్నాళ్ళు కనబడలేదు. అయితే ఎట్టకేలకు బాధితురాలు మోసం చేసిన యువకుడిని హైదరాబాద్ విమానాశ్రయంలో పట్టుకుంది. దీంతో తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరడంతో...తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని డబ్బులు కూడా ఇచ్చే ప్రసక్తి లేదు అంటూ ఆ మోసగాడు తేల్చి చెప్పాడు. దీంతో బాధితురాలు ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించింది వెంటనే పోలీసులు ఆ మోసగాడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు  

మరింత సమాచారం తెలుసుకోండి: