ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే భారతీయులు తమ సత్తా చాటగలరు. మన వారికి ఉన్న ప్రతిభ, పట్టుదల వివిధ దేశాలలో ఎంతో గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి . మన భారతీయులు ఏ దేశ  సంస్కృతిని అయిన గౌరవించగలరు.  మనది కాని దేశం లో ఉంటూ అక్కడి వారితో స్నేహాన్ని పెంచుకుంటూ,  వారి మంచి కోసం  కృషి చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఉద్యోగ రీత్యా వెళ్లి పొరుగు దేశ ప్రజలకు నాయకులుగా ఎదిగిన వారు ఇంకెందరో ఉన్నారు. అలంటి ఒక నాయకుడు మన పండా....

 

ఈయన పూర్తిపేరు పండా శివలింగ ప్రసాద్. కెనడా లో ఆల్బర్టా రాష్ట్రానికి మౌలిక వసతుల మంత్రిగా నియమించబడ్డారు. గత ఏప్రియల్ లో జరిగిన సాధారణ ఎన్నికలలో రెండో సారి ఎమ్మల్యేగా గెలిచిన పండా ఇప్పుడు మంత్రి పదవిని అందిపుచుకున్నారు. పండా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వారు.  విజయవాడలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ముంబై లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లో దాదాపు 16 ఏళ్ళు పని చేశారు.

 

 

 

అక్కడ నుంచి కెనడాలోని జామ్ నగర్ ఆయిల్ రిఫైనరీ నిర్మాణం లో కీలక పాత్ర పోషించారు. మెల్లగా రాజకీయాల్లోకి అడుగులు అడుగుపెట్టారు. ప్రజాసేవ మాత్రమే ధ్యేయంగా ముందుకు వెళ్ళిన పండా కు ఇలా మంత్రి పదవి వరించింది. ఇక ఈయన ప్రధమ లక్ష్యం ఏమిటంటే, తన మంత్రిగా భాద్యత స్వీకరించిన ఆల్బర్టా రాష్ట్రాన్ని అప్పుల బారి నుండి బయటకు తిసుకురవటమే అని చెప్తున్నారు. తెలుగు వారైన పండా కెనడా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడంతో గుంటూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: