విమానంలో 95 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో కూడిన బెక్ ఎయిర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయి కనీసం 14 మంది మృతి చెందినట్లు మధ్య ఆసియా దేశంలోని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన శుక్రవారం,  కజకిస్తాన్ లోని  అల్మాటీ నగర సమీపం లో  జరిగింది.  ఫోకర్ 100 విమానం రాజధాని నూర్-సుల్తాన్ వైపు వెళుతుండగా సిగ్నల్స్ రాక టేకాఫ్ సమయంలో రెండు అంతస్థుల భవనాన్ని ఢీకొట్టి , కాంక్రీట్ కంచె ద్వారా విమానం  విరిగింది  అని కజకిస్తాన్  పౌర విమానయాన కమిటీ  ఒక ప్రకటనలో తెలిపింది.

 

 

 

 

 

 

 

 

 

ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన ఒక ప్రయాణికురాలి కథనం ప్రకారం విమానం నియంత్రణ కోల్పోయి కిందికి పడుతున్నప్పుడు ఒక  భయంకరమైన శబ్దం  విన్నట్లు  ఆమె పేర్కొన్నారు.  విమానం ఒక వైపు వంగి  ఎగురుతూ ఉంది. విమానంలోని ప్రయాణికులంతా   సినిమాలో  మాదిరిగా  గట్టిగ అరవడం, ఏడవడం మొదలుపెట్టారు అని  ఆమె పేర్కొంది.  కనీసం 14 మంది మృతి చెందగా, 22 మంది తీవ్ర ప్రాణాపాయ  స్థితిలో ఆసుపత్రి పాలైనట్లు అల్మాటీ మేయర్ కార్యాలయం తెలిపింది. 

 

 

 

 

 

 

 

 

 

తెల్లవారకముందే విమానం బయలుదేరింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఉందని విమానాశ్రయానికి ప్రయాణిస్తున్న రాయిటర్స్ విలేకరి తెలిపారు.    అల్మెరెక్ గ్రామంలో క్రాష్ సైట్  రన్వే  -చుట్టుముట్టబడింది.  విమానం ఇంటిని ఢీకొని  రెండు భాగాలుగా  విడిపోయి ఇంటి పక్కనే పది ఉందని చూసిన  రాయిటర్స్ రిపోర్టర్ చెప్పారు.   ఫోకర్ 100 జెట్ల విమానాలను నడుపుతున్న కజఖ్ క్యారియర్ బెక్ ఎయిర్, వ్యాఖ్యానించడానికి అందుబాటులో లేరు .  ప్రమాదానికి కారణాలను అధికారులు సూచించలేదు. దర్యాప్తు పెండింగ్‌లో ఉన్న ఆ రకమైన విమానాలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు విమానయాన కమిటీ తెలిపింది.   బాధ్యులు చట్టం ప్రకారం కఠినమైన శిక్షను అనుభవిస్తారు, అని కజఖ్ అధ్యక్షుడు కాస్సిమ్-జోమార్ట్ తోకాయేవ్ ట్వీట్ చేశారు, బాధితులకు మరియు వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: