నచ్చిన వాటి కోసం ఏమైనా చేస్తుంటాం. కావాల్సిన దాని కోసం ఎంతైనా ఖర్చుపెడతాం. ఎంత వరకు అంటే తమ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇష్టపడిన వస్తువుకు ఉన్న డిమాండ్ మాములుగా ఉండదు. ఒకే వేళ మనం ఇష్టపడిన వస్తువు కలిసి వచ్చేదో, లేదా  అదృష్టాన్ని తిసుకువచ్చేదో అయితే ప్రపంచాన్ని తల్లకిందులు చేసి అయిన సరే వాటిని సొంతం చేసుకుంటాం. కొంతమందైతే ముందు వెనక ఆలోచించకుండా చిన్నచిన్న విషయాలకి కూడా భారీగా ఖర్చుపెడతారు. ఈ కోవలోకే చెందినవి ఫ్యాన్సీ నెంబర్ లు. ఫాన్సీ లైఫ్ అలవాటు ఉన్నవాళ్లకి ఇలాంటి వాటిపై ఎక్కువగా మోజు ఉంటుంది. ఈ కోవకి చెందిన వాడే దుబాయ్ లో ఉండే బల్వీందర్ సింగ్.

 

దుబాయిలో స్థిరపడిన ఎంతోమంది భారతీయ వ్యాపారవేత్తలలో ఆయన ఒకరు.  ఈయనకి కార్లు కొనుగోలు చేయడంలో ఉన్న ఇష్టం అంతా ఇంతా కాదు. మార్కెట్ లోకి వచ్చిన కొత్త కార్ ఎధైన తనకి నచ్చితే ఇంట్లో ఉండాల్సిందే. ఈ కమంలోనే ఆయన తాజాగా ముచ్చటపడి ఒక రోల్స్ రాయీస్ లేటెస్ట్ మోడల్ కార్ ను కొనుకున్నాడు. ఆ కార్ నెంబర్ ప్లేట్ కోసం ‘డీ5’ అనే ఫాన్సీ నెంబర్ ఎంచుకున్నాడు. అందులో గోప్పెంటి అనుకోకండి, అసలు విషం ఎమింటంటే...

 

కారు కొంటే సరిపోదు కదా, కారు నుబెర్ ప్లేట్ కూడా ఉండాలి. అయితే ఈ నెంబర్ ప్లేట్ పై తానూ ఎంచుకున్న డీ5  నెంబర్ ఉండాలని కోరుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ నెంబర్ కోసం దాదాపు  రూ. 60 కోట్లు ఖర్చుపెట్టాడు. దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్ పోర్ట్  అథారిటీ ఈ నెంబర్ పై వేసిన వేలంలో  అందరి కన్నా ఎక్కువ కోడ్ చేసి ఫాన్సీ నెంబర్ తన సొంతం చేసుకున్నాడు. వేలం తరువాత బల్వీదర్ మాట్లాడుతూ ‘డీ5’ తన కలిసి వచ్చిన సంఖ్య అని అందుకే కోట్లు లెక్క చేయకుండా వేలం గెలిచానని తెలిపాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: