ఇండియా నుంచీ ఎంతో మంది ఎన్నారైలు వివిధ రాష్ట్రాల నుంచీ వెళ్లి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో స్థిరపడిపోయారు. అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకుని, ఆర్ధికంగా వృద్ధిలోకి వచ్చిన  వారి సొంత గ్రామలలో లేదంటే వారి సొంత రాష్ట్రాలలో ఆస్తులు కొనుగోలు చేయడం మొదలు, వివిధ సంస్థలని పరిశ్రమలని నెలకొల్పే వారు. గతంలో ఇదంతా ఎంతో సులభంగా జరిగిపోయేది. అయితే

 

ప్రస్తుతం ఎన్నారైలు ఆర్ధిక లావాదేవీలు జరపడానికి కాని, మరేదైనా వ్యాపార వృద్ది విషయంలో కానీ లావాదేవీలు జరపాలంటే తప్పకుండా వారి యొక్క పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ కి అనుసంధానం అయ్యి ఉండాల్సిందే. ఈ మేరకు గతంలోనే భారత ప్రభుత్వం ఈ సూచనలని ఎన్నారైలకి చేసింది. అసలు ఎన్నారై లకి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ తో సంభంధం లేకపోయినా భారత్ లో లావాదేవీలు జరపాలంటే మాత్రం ఈ రెండు తప్పనిసరి చేసింది.

 

ఒకవేళ ఎన్నారై లు తమ పాన్ కార్డ్ ని గనుకా ఆధార్ తో అనుసంధానం చేయకపోతే ఆ పాన్ కార్డ్ లు చెల్లుబాటు కావని చెప్పింది. గతంలో సెప్టెంబర్ 30 వరకూ తుది గడువు ఇచ్చి మరలా డిసెంబర్ 31 వరకూ పెంచామని ఇక ఇదే ఆఖరి తేదీ అని ఈ గడువు ముగిసేలోగా ఎన్నారై లు త్వరపడాలని ప్రకటనలో తెలిపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: