గత కొన్నిరోజులుగా ఇండియాలో  వైరల్ అవుతున్న ఈ ఫోటో గురించి ఎంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలు ఈ ఫోటో వెనుక ఉన్న అసలు వాస్తవాలు తెలియకపోయినా కొందమంది కావాలని భారత్ లో ఓ నిర్భందకేంద్రంలో జరిగిన హృదయవిదారక సంఘటన అంటూ, ఆమె బంగ్లా దేశ ముస్లిం యువతి అని, అతడు హిందూ అని, పౌరసత్వ సవరణ కొత్త చట్టం వలన వారు ఇలా నిర్భందించబడ్డారని ప్రచారం జరిగింది..అంతేకాదు

PARRHESIA Nº 20 ...

భవిష్యత్తులో భారత్ లో ఈ చట్టం కారణంగా ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూడాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చాక కాని ఈ ప్రచారానికి తెరపడలేదు. అక్కడితో ఆ సమస్య కి ఓ ముగింపు వచ్చింది. కానీ ఆ ఫోటోని వీక్షించిన కోట్లాది మంది మెదడులని తొలుస్తున్న విషయం ఏమిటంటే. ఈ ఫోటో ఎక్కడిది, ఈ ఘటన ఎక్కడ జరిగింది..ఈ ప్రశ్నకి చుక్కుముడి వీడింది..

 

ఇది నిజంగా విషాదకరమైన ఘటనే. అర్జెంటీనాలో “ఫెడరల్ ప్లాన్” లో భాగమని తెలుస్తోంది. అర్జెంటీనా ప్రభుత్వం అతి తక్కువ ఆదాయంతో ఇళ్ళ సమూహాలని నిర్మించిందని, అయితే అవి పూర్తిగా నిర్మాణం అయ్యేలోగానే కొందరు ప్రజలు వాటిని ఆక్రమించుకున్నారని, ఈ క్రమంలోనే అక్కడి పోలీసులు మహిళలని, పురుషులని ఓ కంచె ద్వారా వేరు చేసి భందించారని ఓ బ్లాగ్ లో స్పష్టంగా ఉంది. అయితే ఆ సమయంలో ఆకలితో ఉన్న ఓ పాపని తన తండ్రి కంచె వద్దకి తీసుకుని వెళ్లి తన భార్య తో పాలు పట్టిస్తున్న సందర్భంలో ఓ జర్నలిస్ట్ ఈ ఫోటోని క్లిక్ మనిపించాడట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: