మన ఇండియన్ అమెరికాలో సత్తా చాటాడు. ఇండియన్స్ ఘనత నిరూపించాడు. భారత దేశం టాలెంట్ కు పుట్టిల్లు అని ప్రూవ్ చేశాడు. బీహార్ కటిహార్ కు చెందిన రివన్ రాజ్ స్కొలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ సాట్ లో ప్రపంచంలోనే మూడో 3వ ర్యాంకు సాధించాడు.


అసలు ఇంతకీ ఈ సాట్ టెస్ట్ ఏంటంటారా.. అమెరికా సహా వివిధ దేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు.. ప్రపంచంలోని కొందరు ప్రతిభావంతులకు స్కాలర్ షిప్ లు ఇచ్చి తమ కళాశాలల్లో చేర్చుకుని ప్రోత్సహిస్తున్నాయి. ఆ టాలెంట్ సెర్చ్ పరీక్షే ఈ సాట్. అమెరికాలో కాలేజ్ బోర్డ్ అనే సంస్థ ఏటా 200 దేశాలకు ఒకేసారి ఈ సాట్ పరీక్ష నిర్వహిస్తోంది.

రివన్ రాజ్ ఈ ఘనత సాధించడం ద్వారా పూర్తి స్కాలర్ షిప్ తో అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆస్ట్రోఫిజిక్స్ చదివే అవకాశం దక్కించుకున్నాడు. రివన్ రాజ్ నాలుగేళ్ల చదువుకు అయ్యే ఖర్చంతా అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. బాగా చదువుకుని దేశం పేరు నిలబెడతానని ధీమాగా చెబుతున్నాడీ ఇండియన్. తన విజయానికి తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే కారణమంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: