న్యూఇయర్ రోజున  హ్యాపీ న్యూ ఇయర్ అంటూ రోడ్లపై ఆర్ధతాత్రి సమయంలో సైలెన్సర్ తీసేసిన బండ్లపై రయ్యి రయ్యిమని తిరుగుతూ అరుస్తూ మాంచి కోలాహలంగా సెలబ్రేషన్ జరుపుకుంటాము. మరి కొందరు భారీగా టపాసులు పేల్చుతూ కేక్ కటింగ్ చేసి  హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తారు . ఇంకొందరు గుంపులు గుంపులు చేసి డ్యాన్స్ లు చేస్తూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ఎంతో సంతోషంగా వేడుకలు జరుపుకుంటారు. అయితే  ఆస్ట్రేలియాలో  ప్రజలు న్యూ ఇయర్ ఎలా చేసుకుంటారో తెలుసా...

Image result for new year celebration in australia

ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ వేడుకలు భారీగా జరుగుతాయి. యావత్ ఆస్ట్రేలియా ప్రజలు మొత్తం ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకలో ఆస్ట్రేలియా ఆచార సాంప్రదాయాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఆస్ట్రేలియన్లు నూతన సంవత్సర వేడుకలని జార్జియన్ క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటారు. అక్కడ ఆ రోజుని సెలవు రోజుగా ప్రకటిస్తారు. అక్కడి ప్రజలు వారి వారి కుటుంభ సభ్యులతో కలిసి బీచ్ లు, హోటల్స్ , పబ్బులలో సరదాగా గడుపుతారు. ఇక్కడ మొత్తం ఆరు రోజుల పాటు వేడుకలు జరుగుతాయి.

 

ముఖ్యంగా అన్ని దేశాలలో కంటే కూడా ఆస్ట్రేలియాలో నూతన సంవత్సర వేడుకలు భారీగా జరుగుతాయి. ప్రపంచ దేశాల నుంచీ ఎంతో మంది పర్యాటకులు ఈ వేడుకలు చూడటానికి తరలి వస్తారు. అక్కడ అధికారికంగా నూతన సంవత్సరాన్ని ప్రకటించేలా చర్చిలో గంటలు 12 సార్లు మ్రోగుతాయి. ఆ తరువాత దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుతారు. ఈ వేడుకల్లో జంతువుల కొమ్ములు, డ్రమ్స్ , సంగీత వాయిద్యాలు, పక్షుల ఈకలతో చేసిన దుస్తులు ఇలా రకరకాల వేషధారణలో అలంకరించుకుని వీధుల్లో తురుగుతారు.అంతేకాదు ఇక్కడ సిడ్నీ ప్రాంతంలో జరిగే నూతన సంవత్సర వేడుకలు ప్రపంచాన్ని ఆకట్టుకునేలా జరుగుతాయి.

Image result for new year celebration in australia

సిడ్నీ లో ప్రసిద్ద సిడ్నీ హార్బర్ వంతెనపై అధికారికంగా పేల్చే బాణాసంచా వెలుగులు అంబరాన్ని తాకుతాయి. సుమారు 80 వేల కి పైగా బాణాసంచాలు ఇక్కడ పెల్చుతారు. ఈ వెలుగుల ద్వారా వచ్చే వేడిమి అక్కడి చల్లని గాలులని వెచ్చగా చేస్తుంది. ఆకాశంలో బాణాసంచా వెలుగులని సుమారు 16 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు సైతం వీక్షించవచ్చు.     

మరింత సమాచారం తెలుసుకోండి: